మీనా.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒక్కప్పుడు తనదైన నటన, అందంతో ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 90ల్లో కుర్రాళ్లలో మీనాకు ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హోమ్లి లుక్స్, క్యూట్ యాక్టింగ్ తో మీనా అందరిని ఆకట్టుకునేది. బాలనటిగా చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా .. కొంతకాలానికి హీరోయిన్ గా మారిపోయింది. అలా తమిళ, తెలుగు, మలయాళ భాషల్లోని అగ్రహీరోల సరసన నటించిన విషయం తెలిసిందే. అలా హీరోయిన్ గా మంచి ఫామ్ లో ఉండగానే బెంగుళురుకు చెందిన విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి నైనికా అనే కుమార్తె ఉంది. అయితే ఈ ఏడాది 28న విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు.
2022 జూన్ 28న మీనా జీవితంలో అతిపెద్ద విషాదం చోటు చేసుకుంది. ఆమె భర్త విద్యాసాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న విద్యాసాగర్.. ఆసుపత్రిలో చేరి ఊహించని విధంగా కన్నుమూశారు. భర్త మరణం తో నటి మీనా తీవ్ర వేదనకు గురయ్యారు. అతి చిన్నవయస్సులోనే ఆమె.. తన తోడును కోల్పోయారు. మీనాకు నైనిక అనే ఒక కూతురు ఉన్నారు. హాయిగా సాగుతున్న మీనా కుటుంబం.. విద్యాసాగర్ మరణంతో చిన్నాభిన్నం అయ్యింది. భర్త మరణంతో మీనా తీవ్రంగా కలత చెందారు. తోటి నటులు కుష్భు, సంఘవి, రంభ తదితరులు మీనాను కలిసి ఓదార్చారు. అయితే భర్త మరణ వేదన నుండి బయటపడేందుకు మీనా కూతురు నైనికతో కలిసి వెకేషన్ కి వెళ్లారు. ఇటీవలే ఈ టూర్ నుండి మీనా తిరిగి వచ్చారు. కాస్తాతేరుకున్న ఆమె తిరిగి సినిమాల్లో నటించడానికి సిద్ధమయ్యారని సమాచారం. భర్త మరణం తరువాత తొలిసారి ఆమె కెమెరా ముందుకు రానున్నారట.
గతంలో తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్ట్స్ కూడా సంతకం చేయనున్నారని సమాచారం. మలయాళ స్టార్ మోహన్ లాల్ కి జోడిగా దృశ్యం 3లో మీనా నటించనున్నారు. దృశ్యం రెండు భాగాల్లో మోహన్ లాల్-మీనా జంటగా నటించింన సంగతి తెలిసిందే. అలానే తెలుగు వర్షన్స్ లో కూడా మీనానే హీరోయిన్ గా నటించడం జరిగింది. ప్రస్తుతం మీనా ఒక ప్రచార చిత్రంలో నటిస్తున్నారు. దానికి సంబంధించిన వీడియో తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె పోస్టు చేశారు. తమిళ చిత్రం రౌడీ బేబీ, మలయాళ చిత్రం జనమ్మ డేవిడ్ చిత్రాల్లో మీనా నటిస్తున్నారు. మరి.. భర్త మరణం తరువాత అంత విషాదంలోను చిత్రపరిశ్రమపై ప్రేమతో తిరిగి మీనా కెమెరా ముందుకు రానున్నడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.