సెలబ్రిటీలకు సంబంధించిన వార్తలు అంటే జనాలు ఆసక్తి చూపుతారు. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు.. పేరు ప్రఖ్యాతులు పొందడం, డబ్బు సంపాదించడం కోసం.. సెలబ్రిటీలకు సంబంధించి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తారు. తాజాగా ఈ తరహా ప్రచారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..
మీనా బాల నటిగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత హీరోయిన్‌గా కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీలో రాణించింది. పెళ్లి తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. గ్యాప్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాల్లో నటిస్తూ.. చాలా బిజీగా ఉంది. ఇక మీనా కుమార్తె కూడా బాల నటిగా సినిమాల్లో చేస్తోంది. సంతోషంగా సాగుతున్న మీనా జీవితంలో అనుకోని కుదుపు సంభవించింది. గతేడాది జూన్‌లో మీనా భర్త విద్యాసాగర్ మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ విషాదం నుంచి తేరుకుంటుంది. బాధను మర్చిపోవడానికి పనిలో బిజీ అవుతోంది. వరుస సినిమాలు చేస్తూ కెరీర్‌లో బిజీగా ఉంది.
తాజాగా ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది మీనా. ప్రస్తుతం తమిళం, మలయాళంలోనూ పలు చిత్రాలకు సైన్ చేసింది. ఇదిలా ఉంటే మీనా వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఆమె రెండో వివాహం చేసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ సారి ఓ నటుడు మీనా రెండో పెళ్లి గురించి కామెంట్స్ చేయడంతో.. ఇది వైరల్‌గా మారింది. ఆ వివరాలు..
మీనా రెండో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొద్ది రోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తన పెళ్లి వార్తలపై స్పందించిన మీనా.. అవన్ని అవాస్తవాలు అని.. స్పష్టం చేయడమే కాక.. వాటిని తీవ్రంగా ఖండిచింది. అయినా సరే మీనా రెండో పెళ్లికి సంబంధించిన రూమర్స్‌కు మాత్రం చెక్ పడటం లేదు. తాజాగా ఓ సినీ క్రిటిక్, నటుడు తమిళ యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మీనా రెండో పెళ్లిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. మీనా త్వరలోనే ఓ తమిళ స్టార్ హీరోను రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు.
మీనా రెండో వివాహం చేసుకోబోయే ఆ హీరో పాన్ ఇండియా స్టార్ అని.. అతడు కూడా గతేడాది భార్యతో విడాకులు తీసుకుని విడిపోయాడంటూ హింట్ ఇచ్చాడు సదరు నటుడు. పైగా ఆ హీరో మీనా కంటే వయసులో చిన్నవాడని.. వారి ఇద్దరి నిశ్చితార్థానికి కూడా ముహుర్తం పెట్టుకున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం అతడి కామెంట్స్ కోలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. దాంతో మరోసారి మీనా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు తెర మీదకు వచ్చాయి.
ఈ ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండటంతో.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అతడిపై మండి పడుతున్నారు. భర్త చనిపోయిన బాధలో ఆమె ఉంటే.. మీకు గుర్తింపు రావడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారా.. ఏదైనా చెబితే నమ్మేలా ఉండాలి.. ఇంకెంత కాలం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తారు అంటూ సదరు క్రిటిక్‌కు చురకలు అంటిస్తున్నారు. ముందు మీ జీవితాలను చక్కదిద్దుకొండి.. తర్వాత వేరే వాళ్ల గురించి కామెంట్స్ చేద్దురు కానీ అంటూ మండి పడుతున్నారు.
రెండో పెళ్లి వార్తలపై మీనా గతంలో స్పష్టత ఇచ్చింది. తనకు రెండో వివాహం చేసుకునే ఉద్దేశం లేదని క్లారిటీ ఇచ్చింది. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రెండో పెళ్లి గురించి మీనాను ప్రశ్నించారు. అందుకు ఆమె స్పందిస్తూ.. ‘‘నా భర్త చనిపోయినప్పటి నుంచి సోషల్ మీడియాలో నా గురించి ఆసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. బాధలో ఉన్న నాకు ఇలాంటి వార్తలు చూస్తే.. ఆ బాధ మరింత పెరుగుతుంది. ఈ విషయం వాళ్లకు ఎందుకు అర్థం కాదు. అసలు నాకు మరో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు’’ అంటూ మీనా కుండ బద్దలు కొట్టారు. మరి సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు ప్రచారం చేయడం సరైందేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.