ఒక వ్యక్తి అంటే తనకు చాలా భయమని అంటున్నారు టాలీవుడ్ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు. తాను భయపడే ఏకైక వ్యక్తి ఆమెనే అని చెబుతున్నారు. విష్ణు అంతగా భయపడే ఆ వ్యక్తి ఎవరంటే..!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో మంచు విష్ణు, విరానికా రెడ్డిలను ఒకటిగా చెప్పొచ్చు. వ్యక్తిగతంగా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని.. చిత్ర పరిశ్రమలో చూడముచ్చటైన జంటగా నిలిచారు. మంచు విష్ణు – విరానికల పెళ్లి జరిగి నేటి (మార్చి 1)తో 14 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా విష్ణు తన ట్విట్టర్ అకౌంట్లో ఓ ఆసక్తికరమైన పోస్టు చేశారు. భార్యతో కలసి దిగిన ఫొటోను షేర్ చేసిన మంచు వారబ్బాయి.. దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జత చేశారు. ‘మా నాన్న కంటే కూడా నేను ఎక్కువగా భయపడేది విరానికకే. అయినా తనను ఎంతగానో ప్రేమిస్తున్నా. హ్యాపీ యానివర్సరీ’ అని విష్ణు రాసుకొచ్చారు.
మంచు విష్ణు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, విష్ణు – విరానిక లవ్ స్టోరీ విషయానికొస్తే.. వాళ్లు తొలుత స్నేహితులుగా మారి ఆ తర్వాత ప్రేమికులయ్యారు. ఇద్దరి ఇళ్లలోనూ పెద్దలను ఒప్పించి 2009లో వివాహం చేసుకున్నారు. ఈ లవ్లీ కపుల్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. విరానిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. ఇక, ఒకవైపు నటుడిగా రాణిస్తూనే మరోవైపు ‘మా’ ప్రెసిడెంట్‌గా ఆ బాధ్యతలు చూసుకుంటున్నారు మంచు విష్ణు. అలాగే తండ్రి మోహన్‌బాబు స్థాపించిన విద్యా సంస్థలను చూసుకుంటూ బిజీబిజీగా ఉంటున్నారు. అలాంటి విష్ణుకు అండగా ఉంటున్నారు విరానిక. మరి.. విష్ణు – విరానిక జంట అంటే మీకూ ఇష్టమా? అయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The only person I am more scared of, more than my dad, @vinimanchu. I love you to the moon and back. Happy anniversary ❤️ pic.twitter.com/GEAZTdPMPa
— Vishnu Manchu (@iVishnuManchu) March 1, 2023