తెలుగు చిత్ర పరిశ్రమలో కాంబినేషన్ లకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇండస్ట్రీలో హిట్ కొట్టిన హీరో, డైరెక్టర్ మరో సారి జతకట్టబోతున్నారు అని తెలిస్తే చాలు.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొంటాయి. అదీ కాక ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయని కాంబో కలిసింది అంటే కూడా అంచనాలు పెరిగిపోతాయి. అయితే హీరోలు డైరెక్టర్లుగా మారి సినిమాలు తీయడం ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఓ క్రేజీ కాంబో సెట్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 15 సంవత్సరాల తర్వాత తెలుగులో మళ్లీ మెగా ఫోన్ పట్టబోతున్నాడు ప్రముఖ కొరియోగ్రాఫర్. ఇప్పుడీ వార్త పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. మరిన్ని వివరాల్లోకి వెళితే..
ప్రభుదేవా.. ఇండియన్ మైఖెల్ జాక్సన్ గా డ్యాన్స్ వరల్డ్ లో తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. గత కొంత కాలంగా బాలీవుడ్ కే పరితమైన ప్రభుదేవా.. అక్కడ అడపాదడపా సినిమాలు చేస్తూ ఉన్నాడు. మరో వైపు కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉన్నాడు. తాజాగా మెగాస్టార్ నటించిన గాడ్ ఫాదర్ లో చిరంజీవి, సల్మాన్ లతో మాస్ స్టెప్పులు వేయించాడు ప్రభుదేవా. ఇక డైరెక్షన్ లో సుదీర్ఘ విరామం తర్వాత తెలుగులో ఓ సినిమాను చేయబోతున్నట్లు సమాచారం. మంచు విష్ణు హీరోగా.. ప్రభుదేవా దర్శకత్వంలో ఓ మూవీ తెరకెక్కుతున్నట్లు టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హీరో మంచు విష్ణుకి కథ వినిపించడం.. అతడు ఓకే చెప్పడం అన్నీ కంప్లీట్ అయ్యాయని వినికిడి. 15 సంవత్సరాల తర్వాత ప్రభుదేవా తెలుగులో సినిమాను డైరెక్ట్ చేయబోతున్నాడు. ఇక ఈ మూవీని విష్ణు తన సొంత బ్యానర్ అయిన AVA ఎంటర్ టైన్మెంట్ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. విష్ణు తాజాగా నటించిన జిన్నా చిత్రంలో ఓ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశాడు ప్రభుదేవా.
ఇక ప్రభుదేవా గతంలో తెలుగులో మూడు సినిమాలు చేశాడు. సిద్దార్థ్, త్రిష జంటగా 2005 లో వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది. నెక్ట్స్ ఇయర్ వెంటనే డార్లింగ్ ప్రభాస్ హీరోగా ‘పౌర్ణమి’ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందింది. తన మూడో చిత్రం మెగాస్టార్ చిరంజీవి హీరోగా ‘శంకర్ దాదా జిందాబాద్’ అనుకున్నంత విజయం సాధించలేక నిరాశ పరిచింది. ఈ నేపథ్యంలోనే చాలా గ్యాప్ తర్వాత ప్రభుదేవా మెగా ఫోన్ పట్టబోతున్నాడు. ఈ మూవీకి సంబంధించిన వివరాలను అధికారికంగా మరికొద్ది రోజుల్లో ప్రకటిస్తారని సమాచారం. తాజాగా మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ మూవీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది.