సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడైన రాజు ఆత్మహత్యపై టాలీవుడ్ ప్రముఖ హీరో మంచు మనోజ్ స్పందించారు. నిందితుడు స్టేషన్‌ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించనట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్టర్‌లో పేర్కొనగా దాన్ని జత చేస్తూ.. ‘దేవుడున్నాడు’, ఈ వార్త చెప్పినందుకు కేటీఆర్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. బాలిక హత్యాచారం పై మనోజ్ స్పందించి మంగళవారం బాలిక కుటుంబాన్ని పరామర్శించి, నిందితుడిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
గత కోదిరోజులుగా పరారీలో ఉన్న నిందితుడి కోసం దాదాపు 1000 మంది పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. నిందితుడు రాజుకి సంబంధించిన సమాచారమిస్తే రూ.10 లక్షల నగదు రివార్డు ఇవ్వనున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. చివరకు స్టేషన్ ఘన్‌పూర్ రైల్వే ట్రాక్‌పై డెడ్‌బాడీ పడి ఉందనే సమాచారంతో స్పాట్‌కి వెళ్లారు పోలీసులు. రాజు చేతిపై ఉన్న టాటూను చూసి ఆతనేనని కన్‌ఫామ్ చేసుకున్నారు. దాంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.