మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డి దంపతుల పెళ్లి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
గత కొంత కాలంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా, విన్నా ఒక్కటే వార్త వినిపించింది. ఆ వార్త ఏంటంటే? మంచు మనోజ్-భూమా మౌనికా రెడ్డిల పెళ్లి, మంచు ఫ్యామిలీలో విభేదాలు అన్న న్యూస్. అయితే ఈ వార్తలన్నింటికి ముగింపు పలుకుతూ.. మంచు మనోజ్-మౌనికల పెళ్లి ఘనంగా జరిగింది. అతి కొద్ది మంది బంధువులు, సెలబ్రిటీస్ ల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక వివాహం తర్వాత మంచు కుటుంబలో విభేదాలు వచ్చాయి అన్న వార్తలు ఇండస్ట్రీని షేక్ చేశాయి. ఆ తర్వాత అది ఓ రియాలిటీ షోలో భాగంగా అని తెలిసి అందరు కంగుతిన్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు మనోజ్-మౌనికా రెడ్డి పెళ్లి వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మంచు మనోజ్.. ఝుమ్మంది నాదం, బిందాస్, వేదం, ఒక్కడు మిగిలాడు సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఆ తర్వాత చేసిన సినిమాలు పెద్దగా సక్సెస్ కాకపోవడంతో.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇక గత కొంత కాలంగా పెళ్లి కారణంగా నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చాడు. భూమా మౌనికారెడ్డితో వివాహం జరిగినప్పటి నుంచి తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు మనోజ్. అయితే ఎన్ని విమర్శలు, ట్రోల్స్ వచ్చినాగానీ వాటిని అంత సీరియస్ గా తీసుకోడు మనోజ్.
ఇక మనోజ్-మౌనికల వివాహనికి సంబంధించిన వీడియో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. పెళ్లి ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు అంతా కలిపి, ఓ కవర్ సాంగ్ లాగా చేశారు. ‘ఏం మనసో ఏం మనసో’ అంటూ సాగే ఈ సాంగ్ అద్భుతంగా ఉంది. అనంత శ్రీరామ్ ఈ పాటను రాయగా.. అచ్చు రాజమని పాడి, సంగీతం అందించాడు. ఈ వీడియోలు మనోజ్ దంపతులు చూడ ముచ్చటగా ఉన్నారు. మంచు లక్ష్మీ అన్ని తానై కార్యక్రమాలన్ని చూసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ పెళ్లికి కొంత మంది సినీ ప్రముఖుల మాత్రమే హాజరై, సందడి చేశారు. ఈ వీడియోలో పలు సందర్భాల్లో భూమా మౌనికా రెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మోహన్ బాబును పట్టుకుని ఉద్వేగానికి లోనైయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.