ఆర్ఆర్ఆర్ సినిమాతో వరల్డ్ వైడ్ పాపులర్ అయిన రాజమౌళి మమతా మోహన్ దాస్ కి కాల్ చేశారట. ఆయన ఒక మాట అనడంతో మమతా మోహన్ దాస్ చాలా బాధపడిందంట. తన గుండె పగిలినంత పని అయ్యిందని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఇంతకీ రాజమౌళి ఏమన్నారు? మమతా మోహన్ దాస్ చేసిన తప్పేంటి?
రాఖీ సినిమాతో సింగర్ గా మారిన మమతా మోహన్ దాస్ తెలుగులో చాలా సినిమాలకు పాటలు పాడింది. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా చేసింది. యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ కి జోడీగా నటించిన మమతా మోహన్ దాస్ ఆ తర్వాత హోమం, చింతకాయల రవి, కింగ్, కేడీ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా తెలుగు సినిమాలకు దూరమయ్యింది. తెలుగు, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ వస్తుంది. అయితే మమతా మోహన్ దాస్ రెండు సార్లు క్యాన్సర్ బారిన పడింది. 2010లో ఒకసారి, 2013లో ఒకసారి. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ తో పోరాడి గెలిచింది. అయితే ఇటీవలే ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
యమదొంగ సినిమాలో నటించమని రాజమౌళి తనకు ఫోన్ చేసి యమదొంగ సినిమా చేయమని అడిగారని.. ఆ సమయంలో తాను చేసిన తప్పుని ప్రస్తావించారని అన్నారు. ఆ సినిమా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావని అన్నారట. ఇంతకే ఆ సినిమా మరేదో కాదు. అనుష్క నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరుంధతి. అనుష్క కంటే ముందు ఈ సినిమా ఆఫర్ మమతా మోహన్ దాస్ కి వచ్చిందట. నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి అడిగితే చేస్తానని సంతకం కూడా చేశానని ఆమె వెల్లడించింది. అయితే తన మేనేజర్ ఆ నిర్మాణ సంస్థ మంచిది కాదని చెప్పడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నానని.. అయితే ఆ తర్వాత ఆ సినిమా విడుదల అయ్యాక చాలా బాధపడినట్లు ఆమె వెల్లడించింది.
అప్పటికీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి రెండు, మూడు నెలల పాటు సినిమా చేయమని రిక్వస్ట్ చేశారని.. కానీ నేనే కుదరదని చెప్పి రిజెక్ట్ చేస్తూ వచ్చానని వెల్లడించింది. ఇదే విషయంపై రాజమౌళి కూడా మాట్లాడారని ఆమె తెలిపింది. యమదొంగ సినిమా కోసం రాజమౌళి తనకు కాల్ చేశారని.. ఆ సమయంలో అరుంధతి సినిమాని అనవసరంగా మిస్ చేసుకున్నావని అన్నారట. అరుంధతి సినిమా నువ్వు చేయాల్సింది అని అన్నారని, వదిలేసి చాలా పెద్ద తప్పు చేశావని అన్న విషయాన్ని గుర్తు చేసుకుంది. రాజమౌళి అలా అనడంతో తన గుండె పగిలిపోయినట్లు అయ్యిందని.. అయితే అప్పటికి ఆ సినిమా విడుదల కాలేదని వెల్లడించింది. మరి అరుంధతి సినిమాలో మమతా మోహన్ దాస్ నటించి ఉంటే ఎలా ఉండేదో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.