నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన 'మళ్లీ పెళ్లి' సినిమా నుంచి మరో అప్‌డేట్ వచ్చేసింది. 'రా రా హుజూరు నాతో..' అని సాగే రొమాంటిక్ రైన్ సాంగ్ ఈ రోజు రిలీజైంది.
ఈ ఏడాదిలో చెప్పుకోదగ్గ సినిమా జంట, నిత్యం వార్తల్లో నిలిచిన అంశం ఏదైనా ఉందా? అంటే అది ‘నరేష్-పవిత్రాలోకేష్‘ జంటే. అంతెందుకు కరోనా తరువాత మోస్ట్ ఎంటర్టైనింగ్ న్యూస్ ఏది అంటే.. వీరి ప్రేమ వ్యవహారమే. కొత్త సంవత్సరం సందర్భంగా తాము వివాహం చేసుకోబుతున్నామని ఈ జంట ప్రకటించిన నాటి నుంచి.. వీరిద్దరి ప్రేమ కథా చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో ఒక సంచలనం. ఇక వీరిద్దరూ జంటగా నటించిన మూవీ ‘మళ్లీ పెళ్లి’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 26న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఒక్కొక్క పాటను ప్రేక్షకుల ముందుకు విడుదల చేస్తున్నారు.
నరేష్- పవిత్ర లోకేష్ జంటగా నటించిన మూవీ ‘మళ్లీ పెళ్లి’ టీజర్ ఇప్పటికే అందరూ చూసే ఉంటారు. టీజర్ ఆసక్తికరంగా ఉండటంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయని చెప్పాలి. ప్రస్తుతం వీరి పెళ్ళికి కొన్ని అడ్డంకులు ఏర్పడినా.. ఈ సినిమాలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవడం, మూవీ సీన్స్ అన్నీ వారి నిజ జీవితానికి దగ్గరగా ఉండటం ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతోంది. ఇక ట్రోలర్స్ సంగతైతే చెప్పక్కర్లేదు. ఈ మూవీ అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? వాడేద్దామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో సాంగ్ రిలీజైంది. ‘రా రా హోసూరు నాతో..’ అనే రొమాంటిక్ రైన్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘రా రా హోసూరు నాతో’ సాంగ్‌లో నరేష్, పవిత్ర లోకేష్‌తోపాటు మరో జంట కూడా ఉంది. మీరు అనుకున్నట్లు అలాంటి సన్నివేశాలు లేకున్నా.. లిరిక్స్ బాగున్నాయ్ అని చెప్పాలి. ఇప్పటికే ఈ పాట చూసిన వారందరూ సూపర్బ్ అని ప్రశంసిస్తున్నారు.ఈ చిత్రాన్ని మెగా మూవీ మేకర్, డైరెక్టర్ ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ సినిమా సకుటుంబ సమేతంగా చూడదగ్గది అయినప్పటికీ, కుర్రకారుకి మంచి వినోదాన్ని పంచుతుందనే చెప్పాలి. లేటు వయసులో వీరిద్దరూ ఎలా కలిశారు..? వీరి మద్య ప్రేమ ఎప్పుడు చిగురించింది..? అన్న నిజ జీవిత దృశ్యాలు ఇందులో ఉండొచ్చనే మాటలు వినపడుతున్నాయి. ఈ సినిమాను మీరు తప్పకుండా చూసి, మీ అభిప్రాయాలను మాతో పంచుకోగలరు.