దేశంలో ఎక్కడ చూసినా మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు నిత్యం ఏదో ఒక చోట మహిళలపై ఈ విధమైనటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఈ కష్టాలు సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు కూడా తప్పడం లేదు. మాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ విజయ్ బాబు పై ఇటీవల అత్యాచారం కేసు నమోదు అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ నటుడికి కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. కోర్టులో విజయ్ బాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటీషన్ కొట్టిపడేసింది. అంతేకాదు విజయ్ బాబు కోర్టుకు తప్పని సరిగా హాజరు కావాల్సిందే అని చెప్పింది.
ప్రస్తుతం విజయ్ బాబు దుబాయ్ లో తలదాచుకున్నాడని, అందుకే అతను కోర్టుకు హాజరు కాలేకపోతున్నాడని అతని తరుపు న్యాయవాది చెప్పినప్పటికీ న్యాయస్థానం మాత్రం అతడిని కొచ్చికి వచ్చి కోర్టులో హాజరు కావాల్సిందే అని అదేశాలు జారీ చేసింది. కోజికోడ్ కు చెందిన అప్ కమింగ్ నటి విజయ్ బాబు మాయమాటలు చెప్పిన తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తనకు సినిమా ఛాన్సులు ఇప్పిస్తానని చప్పి రూమ్ కి రమ్మని తినే పదార్థంలో మత్తు మందు కలిపి తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. ఈ నేపథ్యంలో పోలీసులు విజయ్ బాబు పై పలు సెక్షన్లకింద కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే.. ఈ విషయంపై నటుడు విజయ్ స్పందిస్తూ… తను ఎలాంటి తప్పు చేయలేదని ఈ వివాదంలో కావాలనే ఆ మహిళ తనను లాగుతోంది అంటూ ట్విట్ చేశాడు. అయితే ఈ ట్విట్ పై అభిమానులు విమర్శలు గుప్పించారు. ఎలాంటి నేరం చేయకుంటే కోర్టులో సరెండ్ అయి పోరాటం చేయొచ్చు కదా.. అని కామెంట్స్ చేశారు.
విజయ్ బాబు రేపు బుధవారం కొచ్చిలోకి దిగుతాడని, వెంటనే అక్కడ నుంచి కోర్టులోకి హాజరు కానున్నట్టు తెలుస్తుంది. అతను కేరళాకు తిరిగి రాకుంటే అతని పిటీషన్ పరిగణలోకి తీసుకోబోమని ఇప్పటికే స్పష్టం చేసింది కోర్టు. మరి బుధవారం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అని మాలీవుడ్ లో తెగ చర్చలు నడుస్తున్నాయి. ఈ కేసు లో న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇస్తుందో చూడాలి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.