మమ్ముట్టి, మోహన్ లాల్ నుండి మొన్న వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించినే షైన్ టామ్ చాకో వరకు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన వారే. వారి నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ఉన్ని ముకుందన్. ఈ నటుడు ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్నాడు.
ఇటీవల మలయాళ నటీమణులే కాదూ నటులు కూడా సత్తా చాటుతున్నారు. డబ్బింగ్ సినిమాలతోనే కాకుండా.. నేరుగా తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు. మమ్ముట్టి, మోహన్ లాల్ నుండి మొన్న వచ్చిన దసరా సినిమాలో విలన్‌గా నటించినే షైన్ టామ్ చాకో వరకు మలయాళ పరిశ్రమ నుండి వచ్చిన వారే. వారి నటనతో తెలుగు ఆడియన్స్ ను ఫిదా చేస్తూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. అటువంటి వారిలో ఒకరు ఉన్ని ముకుందన్. ఈ పేరు చెబితే తెలియదు కానీ భాగమతిలో అనుష్క ప్రేమించిన వ్యక్తిగా, సమంత యశోదలో యంగ్ డాక్టర్‌గా నటించి మెప్పు పొందారు. జూనియర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ యంగ్ టాలెండెట్ ప్రస్తుతం ఓ వివాదంలో చిక్కుకున్నారు. తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళ పోలీసు కేసు నమోదు చేసింది. అయితే తాజాగా కేరళ హైకోర్టు హీరోకు షాకిచ్చింది. అసలు ఏమైందంటే..?
ఓ సినిమా ప్రాజెక్టు గురించి చర్చించేందుకు కొచ్చిలోని ఆయన ఇంటికి వెళ్లిన సమయంలో తనను అసభ్యంగా తాకుతూ, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 2017లో ఓ మహిళ ఉన్నిముకుందన్‌పై పోలీసు కేసు నమోదు చేసింది. ఈ ఘటన ఆ ఏడాది ఆగస్టులో జరగ్గా.. సెప్టెంబరులో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. లైంగిక ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం కేసును దాఖలు చేశారు. ఈ విషయంపై రాజీ కుదుర్చుకునే సమయంలో ఆమెను తనను రూ.25 లక్షలు డిమాండ్ చేసిందని పేర్కొన్నారు. ఈ కేసును కొట్టివేయాలని మేజిస్ట్రేట్, సెషన్స్ కోర్టుల్లో ఫిర్యాదు దాఖలు చేశారు. తనను నిర్థోషిగా ప్రకటించాలని పిటిషన్ దాఖలు చేశారు.
అయితే ఇరువర్గాలు సెటిల్‌మెంట్‌కు వచ్చాయని తెలుపుతూ హీరో కోర్టులో నకిలీ అఫిడవిట్ దాఖలు చేశాడని మహిళ తరఫు న్యాయవాది కోర్టులో పేర్కొన్నారు. ఈ అఫిడవిట్ ఆధారంగా కేరళ హైకోర్టు ఈ కేసుపై స్టే విధించింది. తాజాగా ఉన్ని ముకుందన్‌కు కేరళ హైకోర్టు షాకిచ్చింది. లైంగిక వేధింపుల కేసులో తనను నిర్దోషిగా ప్రకటించాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ఈ కేసుపై ఫిబ్రవరి 2023లో విధించిన స్టేను తాజాగా హైకోర్టు తోసిపుచ్చుతూ.. విచారణ జరపాలని ఆదేశించింది. ఉన్ని ముకుందన్ చివరిసారిగా మలికాపురం అనే చిత్రంలో కనిపించారు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి విదితమే.