ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఆదివారం ప్రముఖ భోజ్‌పురి నటి ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం కలకలం రేపింది. ఈ విషాదం నుంచి కోలుకోకముందే మరో విషాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు..
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచే ఎందరో సెలబ్రిటీలు తుది శ్వాస విడిచారు. కొందరు అనారోగ్య కారణాల వల్ల మృతి చెందితే.. మరి కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. వరుసగా గత రెండు రోజుల నుంచి ప్రముఖులు మృతి చెందని సంగతి తెలిసిందే. శనివారం నాడు ప్రముఖ కన్నడ దర్శకుడు కిరణ్ గోవి హఠాత్తుగా గుండెపోటు కారణంగా మృతి చెందగా.. ఆదివారం నాడు ప్రముఖ భోజ్‌పురి నటి ఆకాంక్ష దూబే ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం సంచలనంగా మారింది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆకాంక్ష.. ఇంత ఆకస్మాత్తుగా.. అది కూడా ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఈ విషాదల నుంచి ఇంకా కోలుకోకముందే.. మరో విషాదం చోటు చేసుకుంది. సీనియర్ నటుడు, మాజీ ఎంపీ ఒకరు మృతి చెందారు. ఆ వివరాలు..
ప్రముఖ మలయాళ నటుడు, మాజీ ఎంపీ, ఇన్నోసెంట్(75) మృతి చెందారు. కేరళలోని కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. వార్తా ఏజెన్సీ ఏఎన్‌ఐ కథనం ప్రకారం.. ఇన్నోసెంట్.. కరోనా ఇన్ఫెక్షన్, శ్వాసకోశ వ్యాధులు, బహుళ అవయవ వైఫల్యం, గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు.. వైద్యులు వెల్లడించారు. మార్చి 3న ఆయన అస్వస్థతకు గురయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. కానీ వైద్యులు ప్రయత్నాలు ఫలించలేదు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు.
ఇన్నోసెంట్‌కు 2012లో క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. సుమారు మూడేళ్ల పాటు.. ఆయన దానితో పోరాడి.. మహమ్మారిపై విజయం సాధించారు. ఈ క్రమంలో క్యాన్సర్‌తో తన పోరాటం.. ఆ సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి ‘లాఫ్టర్ ఇన్ ది క్యాన్సర్ వార్డ్’ పుస్తకంలో వివరించాడు. ఆయన 2014-2019 మధ్య కాలంలో లోక్‌సభ ఎంపీగా సేవలందించారు. ఈ క్రమంలో ఇన్నోసెంట్ మృతి పట్ల.. సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ సానుభూతి తెలుపుతున్నారు.
ఇన్నోసెంట్ మొదట నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత 1972లో కమెడియన్‌గా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు. ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతికాడ్ కుమారుడ్ అనూప్ సత్యన్ డైరెక్షన్‌లో వచ్చిన పచువుమ్ అత్బుతవిలక్కుమ్ సినిమాలో నటించారు. ఇక ఆయన తాజాగా నటించిన కడువ చిత్రం ఇటీవలే విడుదల అయ్యింది. ఇన్నోసెంట్ పలు చిత్రాల్లో పాటలు కూడా పాడారు. నటనతో పాటు రాజకీయాల్లో కూడా ఇన్నోసెంట్ చాలా యాక్టీవ్‌గా ఉండే వారు. సినిమా పరిశ్రమతో పాటు, రాజకీయాల్లో కూడా మంచి పేరు సంపాదించుకున్నారు. ఆయన మృతి తీరని లోటు అంటున్నారు.