మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన చిత్రం గని. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, తమన్నా స్పెషల్ సాంగ్ మొత్తం ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి. ముఖ్యంగా అందరూ మాట్లాడుకుంటున్నది సినిమా కోసం వరుణ్ ఎంతలా ట్రాన్స్ ఫార్మ్ అయ్యాడు అనే దాని గురించే. అందుకు వరుణ్ తేజ్ ఎంత కష్టపడ్డాడో చూపిస్తూ ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు.
ఇదీ చదవండి: జబర్దస్త్ జడ్జీ పోస్ట్ నుంచి రోజా అవుట్!
వీడియోలో వరుణ్ వర్కౌట్స్ చేయడం, రింగ్ లో బాక్సింగ్ చేస్తూ కనిపించాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాకి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లు బాబీ కంపెనీ, సిద్దు ముద్ద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ గని సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. గని సినిమాలో వరుణ్ పాత్ర ఎలా ఉండబోతోంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.