సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా సినిమాలలో కేజీఎఫ్ చాప్టర్ 2 ఒకటి. కన్నడ డాషింగ్ హీరో యష్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ మాఫియా చిత్రం.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఇక ఈ పాన్ ఇండియా మూవీ సెకండ్ పార్ట్ కేజీఎఫ్ చాప్టర్ 2.. ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తాజాగా కేజీఎఫ్ చాప్టర్ 2 ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అయితే.. మిలియన్ల వ్యూస్ తో ట్రైలర్ అన్ని భాషల్లో ట్రెండ్ సృష్టిస్తోంది. అయితే.. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ పాత్ర ద్వారా కథను నేరేట్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ లో చాప్టర్ 1 లో కనిపించిన అనంత్ నాగ్ క్యారెక్టర్ కనిపించకపోవడం గమనార్హం. కేజీఎఫ్ కథను ముందుకు నడిపిన అనంత్ నాగ్.. జర్నలిస్ట్ ఆనంద్ వాసిరాజ్ పాత్ర ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు.చాప్టర్ 2లో ఆయన క్యారెక్టర్ కనిపించకపోయేసరికి అందరిలో ఆనంద్ వాసిరాజ్ క్యారెక్టర్ లో ప్రకాష్ రాజ్ నే రీప్లేస్ చేశారనే సందేహాలు వ్యక్తమయ్యాయి. ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ కనిపించడంతో కొంతమంది ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అనంత్ నాగ్ ను తీసేసి ప్రకాష్ రాజ్ ను రీప్లేస్ చేయడం ఏమాత్రం బాగోలేదని కామెంట్స్ చేశారు. అయితే ఈ విషయంపై దర్శకుడు ప్రశాంత్ నీల్ ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు.
అందరూ అనుకుంటున్నట్టుగా కేజీఎఫ్ చాప్టర్ 2లో అనంత్ నాగ్ పాత్రకోసం ప్రకాష్ రాజ్ రీప్లేస్ చేయలేదని.. చాప్టర్ 1లో నటించిన అనంత్ నాగ్ పాత్ర చాప్టర్ 2లో కూడా కొనసాగుతుందని అన్నారు. అలాగే అనంత్ నాగ్ పాత్రతో పాటు మరో పాత్ర ఉండబోతుందని.. ఆ పాత్రలో ప్రకాష్ రాజ్ కనిపించనున్నాడని క్లారిటీ ఇచ్చాడు. ఆ విషయాన్ని క్లియర్ గా చెప్పేందుకే ట్రైలర్ లో ప్రకాష్ రాజ్ చేత.. “రక్తంతో రాసిన కథ ఇది. సిరాతో ముందుకు తీసుకెళ్ళాం” అనే డైలాగ్ ద్వారా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కావాలంటే మీరు ఈ విషయాన్నీట్రైలర్ లో గమనించవచ్చు.
ఇక ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ తో పాటు అనంత్ నాగ్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందని తెలుస్తుంది. ఈ విషయంలో ఫ్యాన్స్ కంగారు పడే అవసరం లేదని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. కేజీఎఫ్ చాప్టర్ 1 భారీ విజయం సాధించడంతో చాప్టర్ 2పై భారీ అంచనాలు నెలకొన్నాయి. యష్ హీరోగా నటించిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కనిపించనుంది. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజ్, రావు రమేష్ తదితర స్టార్ యాక్టర్స్ కీలకపాత్రలలో కనిపించనున్నారు. మరి కేజీఎఫ్ చాప్టర్ 2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.