సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. అంతేకాకుండా మూవీస్ కంటే ముఖ్యంగా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించి తన మంచి మనసు చాటుకుంటున్నాడు మహేశ్ బాబు. ప్రస్తుతం మహేశ్ ఫ్యాన్స్ మొత్తం సర్కారు వారి పాట సినిమా మేనియాలో ఉన్నారు. మే 12న ఆ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. ఆ మూవీలో మహేశ్ లుక్స్, స్లాంగ్ ఎంతో అలరించేవిధంగా ఉన్నాయి. అంతేకాకుండా విటేజ్ మహేశ్ ను గుర్తు చేస్తున్నాయి. అది కాకుండా ఫ్యాన్స్ కు మరో సర్ ప్రైజ్ వచ్చింది.
అదేంటంటే ఇటీవల ది పీకాక్ మ్యాగజీన్ మహేశ్ పిక్ కవర్ ఫొటోగా ప్రింట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫొటో షూట్ కు సంబంధించిన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ షూట్ లో మహేశ్ లుక్స్ చూస్తే మైండ్ పోతోందంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. ఇంత స్టైల్ గా, హుందాగా భరత్ అనే నేను, మహర్షి వంటి సినిమాల్లో సైతం అంతటి క్లాస్ లుక్ చూసుండరు అంటూ సంబరపడి పోతున్నారు. ఇంక ఫ్యాన్స్ కు అయితే ఆ వీడియో చూస్తే పూనకాలు రావాల్సిందే అటూ చెప్పుకొస్తున్నారు. అటు సర్కారు వారి పాట, ఇటు పీకాక్ మ్యాగజీన్ వీడియో చూస్తుంటే మహేశ్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయనే చెప్పాలి. ఫొటో షూట్ వీడియోలో మహేశ్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Been a pleasure shooting with the #ThePeacockMagazine team! Looking forward to the May-Jun 2022 issue! @falgunipeacock @shanepeacock pic.twitter.com/vforBGFU5W
— Mahesh Babu (@urstrulyMahesh) May 12, 2022
One of my most favourite shoots! #ThePeacockMagazine @falgunipeacock @shanepeacock pic.twitter.com/PJ7iRDdS3O
— Mahesh Babu (@urstrulyMahesh) May 11, 2022
Humbled and honoured to be starring on the cover of #ThePeacockMagazine. The shoot and the overall experience was so much fun! Thank you @falgunipeacock and @shanepeacock. Here’s to many more! 🤗 pic.twitter.com/pbaoVkcc4f
— Mahesh Babu (@urstrulyMahesh) May 10, 2022