కొద్దిరోజల క్రితం సర్కారు వారి పాట మూవీ షూటింగ్ నుంచి సూపర్‌స్టార్ మహేష్‌బాబు బ్రేక్ తీసుకున్నారు. దీంతో సర్కారు వారి పాట విడుదల కూడా సమ్మర్‌కి వాయిదా పడింది. మొదట జనవరి 14న సంక్రాంతి కానుకగా సర్కారు వారి పాట విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన చిత్ర బృందం, అనూహ్యంగా ఏప్రిల్ 1న వస్తున్నట్లు అధికారికంగా తెలియజేశారు. దీనికి ప్రధాన కారణం మహేష్‌బాబు సర్జరీ అని సమాచారం. కొన్నాళ్లుగా మహేష్ మోకాలి నొప్పి సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే.
మోకాలికి సర్జరీ చేయించుకునేందుకే ఆయన షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చారని టాక్. కాగా ఆయనకు స్పెయిన్‌లో సర్జరీ అయినట్లు, ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్నట్లు సమాచారం. ఆయనతో పాటు భార్య నమ్రత, పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దుబాయ్‌లో నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ నివాసం ఉంటున్నారు. అక్కడే కొన్ని రోజులు మహేష్ విశ్రాంతి తీసుకోనున్నట్లు వినికిడి. కాగా మహేష్‌బాబు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బట్టల వ్యాపారంలోకి మహేష్ బాబు.. సూపర్ స్టార్ బ్రాండ్ తో షర్ట్స్