సన్నీ లియోన్ లేటెస్ట్ యూట్యూబ్ సెన్సేషన్ మధుబన్ మే రాధిక సాంగ్ కు నిరసన సెగ తగులుతోంది. ఆ పాటను బ్యాన్ చేయాలంటూ కొందరు డిమాండ్ చేస్తున్నారు. మధురకు చెందిన కొందరు మత పెద్దలు ఈ పాటపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాటను వెంటనే బ్యాన్ చేయాలని, సన్నీ లియోన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ పాట ఒరిజినల్ సాంగ్ ను 1960ల్లో కోహినూరు చిత్రంలో మహ్మద్ రఫీ ఆలపించారు. ఆ సాంగ్ ను తాజాగా రీమేక్ చేశారు. ఆ పాటలో తమ మనోభావాలను కించపరిచేలా ఒక సీన్ ఉందని దానిని వెంటనే తొలగించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. ఆ సీన్ తొలగించి సన్నీలియోన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంపై వెంటనే స్పందించాలని కోరుతున్నారు.
సరిగమ మ్యూజిక్ ఈ పాటను బుధవారం విడుదల చేశారు. మధుబన్ మే రాధిక పాటలో సన్నీ లియోన్ లీడ్ రోల్ చేయగా.. కనికా కపూర్, అరిందం చక్రవర్తి ఆలపించారు. కృష్ణుడు, రాధ మధ్య ఉండే ప్రేమ కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందిచారు. ఆ పాటలోని స్టెప్పులు, వస్త్రధారణ తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ సోషల్ మీడియాలోనూ వ్యతిరేకత వచ్చింది. సన్నీ లియోన్ మధుబన్ మే రాధిక పాటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.