కథలు బాగుంటే సినిమాలు ఎప్పుడైనా మంచి విజయాలు సాధిస్తాయి. ఈ విషయం ఇప్పటిదాకా ఎన్నోసార్లు ప్రూవ్ అయినప్పటికీ.. అప్పుడప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆడియెన్స్. కొద్దికాలంగా అలాంటిదేం లేదంటున్నారు. సినిమాలు కమర్షియల్ జానర్ లో వచ్చినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. అంటున్నారు. అలా సంచలనం సృష్టించిన సినిమాలలో 'లవ్ టుడే' ఒకటి.
సాధారణంగా కథలు బాగుంటే సినిమాలు ఎప్పుడైనా మంచి విజయాలు సాధిస్తాయి. ఈ విషయం ఇప్పటిదాకా ఎన్నోసార్లు ప్రూవ్ అయినప్పటికీ.. అప్పుడప్పుడు మళ్లీ కమర్షియల్ సినిమాలతో కన్ఫ్యూజ్ అవుతుంటారు ఆడియెన్స్. ఇదివరకంటే కన్ఫ్యూజ్ అయ్యారేమోగాని.. కొద్దికాలంగా అలాంటిదేం లేదంటున్నారు. సినిమాలు కమర్షియల్ జానర్ లో వచ్చినా.. కంటెంట్ ముఖ్యం బిగిలూ.. అంటున్నారు. అలా గతేడాది కంటెంట్ తో వచ్చి బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. వాటిలో తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి ఏకంగా రూ. 100 కోట్లు కొల్లగొట్టిన సినిమాలు కూడా ఉన్నాయి. అలా సంచలనం సృష్టించిన సినిమాలలో ‘లవ్ టుడే’ ఒకటి.
తమిళ యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్.. మొదటిసారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని నమోదు చేసింది. ముందుగా కేవలం తమిళ భాష వరకే రిలీజ్ అయినప్పటికీ.. సినిమా సక్సెస్ చూసి తెలుగు ప్రొడ్యూసర్ దిల్ రాజు.. లవ్ టుడేని తెలుగులోకి డబ్ చేయించి రిలీజ్ చేశారు. దర్శకుడు కం హీరో ప్రదీప్ రంగనాథన్.. లవ్ టుడేలో ప్రస్తుతం యూత్ ఫేస్ చేస్తున్న విషయాలను.. ఎంతో చక్కగా కామెడీ టచ్ తో తెరకెక్కించి అద్భుతమైన విజయాన్ని.. హీరోగా బ్లాక్ బస్టర్ డెబ్యూని అందుకున్నాడు. ఈరోజుల్లో యూత్ కి నచ్చితే చాలు.. బ్రహ్మరథం పట్టేసి.. సినిమాలకు అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టేలా చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో ఇవానా హీరోయిన్ గా నటించింది. ట్రేడ్ వర్గాలని షేక్ చేస్తూ.. రూ. 5 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ.. దాదాపు రూ. 100 కోట్లు వసూల్ చేసింది. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ లో ఈ సినిమాని కల్పాతి ఎస్. అఘోరం, అర్చన నిర్మించారు. తమిళ తెలుగు భాషలలో సంచలన వసూళ్లు రాబట్టిన ఈ సినిమా.. ఇప్పుడు హిందీ రీమేక్ కి రెడీ అవుతోంది. ఈ విషయాన్నీ నిర్మాత అర్చన కల్పాతి సోషల్ మీడియాలో ట్వీట్ ద్వారా కన్ఫర్మ్ చేసింది. హిందీ రీమేక్ ని ఏజీఎస్ బ్యానర్ తో పాటు ఫాంటమ్ స్టూడియోస్ వారు నిర్మించనున్నట్లు ఆమె తెలిపింది. 2024 ప్రారంభంలో సినిమా రిలీజ్ కానుండగా.. ఇందులో యాక్టర్స్, డైరెక్టర్ ఎవరు అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం లవ్ టుడే మూవీ నెట్ ఫ్లిక్స్ లో తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి లవ్ టుడే మూవీ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Super happy to announce the Hindi Remake of #LoveToday in association with Phantom Films @FuhSePhantom @shrishtiarya Can’t wait to take this film to a larger audience with a super interesting cast and crew ❤️ @pradeeponelife @Ags_production @aishkalpathi
— Archana Kalpathi (@archanakalpathi) February 20, 2023