తెలుగు బుల్లి తెరపై బిగ్ బాస్ గురుంచి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పటకి నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో సీజన్-5లోకి అడుగుపెట్టబోతోంది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్నా ఈ షో ఎట్టకేలకు మొదలుపెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి కావటంతో త్వరలో దీనిని పారంభించటానికి బిగ్ బాస్ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారట.
ప్రతీ సీజన్ లో ఏదో కాంట్రవర్సి వ్యక్తులను, సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న సెలబ్రెటీలను తీసుకొస్తారు. సీజన్ -3లో పెళ్లైన వితిక-వరుణ్ సందేశ్‌లు జంటగా వెళ్లి బిగ్ బాస్ హౌజ్‌లో సందడి చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సారి అలా కాకూండా పీకల్లోతు ప్రేమలో ఉండి త్వరలో పెళ్లి చేసుకోబుతున్న జంటను బిగ్ బాస్-5లోకి పరిచయం చేయబోతున్నారు. అవును..మీరు విన్నది నిజమే.
శ్రీహాన్-సిరి హనుమంత్ అనే రోమాంటిక్ ప్రేమ జంటను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ఉయ్యాల జంపాల సీరియల్ ద్వారా బుల్లితెరపై సందడి చేసింది సిరి హనుమంత్. మోహిని, అగ్ని సాక్షి వంటి సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందింది. ఇక ఈ నేపథ్యంలో శ్రీహాన్ అనే ఆర్టిస్ట్‌తో సిరి హనుమంత్ కలిసి ‘సాఫ్ట్ వేర్ బిచ్చగాళ్లు’ షార్ట్ ఫిల్మ్, రామ్ లీలా అనే వెబ్ సిరీస్ లో కలిసి నటించారు. ఈ క్రమంలోనే వీళ్లిద్దరు ప్రేమించుకున్నారని తెలుస్తోంది. ఇక త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జంట బిగ్ బాస్ స్-5 లోకి వెళ్ళబోతున్నారని తెలుస్తోంది. ఇదే కాకూండా ఈ సారి హోస్ట్ గా రానా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.