రెండు అక్షరాల ప్రేమ ఇద్దరి మనసులను ఏకంచేస్తుంది. యువతీ యువకులు ఒకరిపట్ల ఒకరు ఆకర్షితులై ప్రేమించుకుంటారు. ప్రేమే లోకంగా జీవిస్తుంటారు. కొన్ని ప్రేమ కథలు పెళ్లి వరకు వెళ్తాయి. మరికొన్ని మధ్యలోనే బ్రేకప్ అయిపోతాయి. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి దక్కకపోతే వారు పడే మనోవేదన అంతా ఇంతా కాదు. కొన్ని సంధర్భాల్లో చావుకు కూడా వెనకాడరు. ఈ కథలో కూడా అలాంటి సంఘటనే జరిగింది. మరి ఆ వివరాలేంటో చూద్దాం..

రంగారెడ్డి జిల్లా కొత్వాల్ గూడ గ్రామానికి చెందిన సిద్దాంతి శివ అనే యువకుడు, ఓ యువతితో ప్రేమలో పడ్డాడు. ఆ యువతికి కూడా ఆ యువకుడు అంటే చాలా ఇష్టం. ఇద్దరి మనసులు కలిశాయి. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా మారిపోయారు. ఇంకేముంది పెళ్లి చేసుకుని ఒక్కటవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు వీరి ప్రేమను అంగీకరించలేదు. పెళ్లి చేయడానికి ఒప్పుకోలేదు. ఆమెను మరిచిపోవాలని యువతి కుటుంబసభ్యులు యువకుడిని హెచ్చరించారు. ఈ క్రమంలోనే యువతి తల్లిదండ్రులు మరో యువకుడితో పెళ్లి చేయడానికి సిద్దపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న శివ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇంతకాలం ప్రాణంగా ప్రేమించిన యువతి తనకు దక్కదేమోనని కలవరపడ్డాడు. ఈ సంఘర్షనలో ఉన్న ఆ యువకుడు కొత్వాల్ గూడ లోని పొలం వద్దకు వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు చెట్టంత కొడుకు ఇలా అర్థాంతరంగా తనువు చాలించడంతో వారు గుండెలవిసేలా రోదించారు. శివ మృతదేహంతో ఆ అమ్మాయి ఇంటి ముందు నిరసనకు దిగారు. శివ మృతికి యువతి కుటుంబసభ్యులే కారణం అంటూ యువకుడి తండ్రి చంద్రయ్య ఆరోపించాడు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మృతుడి బందువులతో మాట్లాడి వారిని శాంతింపజేసి అక్కడి నుంచి పంపించారు. యువకుడి తండ్రి చంద్రయ్య పిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.