ఇటీవల ఈ ప్రేమ జంట ఆర్య సమాజ్ లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత తమకు రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించారు. అయినా సరే యువతి కుటుంబ సభ్యులు యువకుడి కుటుంభికులపై దాడి చేశారు. దీంతో ఈ ప్రేమికులు తాజాగా పోలీస్ ఉన్నతాధికారులను కలిసి రక్షణ కల్పించాలంటూ వేడుకున్నారు.
నేటి కాలం యువత తల్లిదండ్రులు కుదిర్చిన వివాహాల కన్న ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు. ఇక తల్లిదండ్రలుకు ఇష్టం లేకుండా పెళ్లిళ్లు చేసుకోవడంతో యువతి తల్లిదండ్రులు యువకుడి కుటుంబ సభ్యులపై దాడులు చేయడంతో పాటు చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ప్రేమ జంట ఆర్య సమాజ్ లో వివాహం చేసుకుని స్థానిక పోలీసులను ఆశ్రయించారు. ఇక వారి నుంచి న్యాయం జరగలేదని తెలుసుకున్న ఆ ప్రేమికులు.. తాజాగా పోలీస్ కమిషనర్ ను ఆశ్రయించి రక్షణ కల్పించాలంటూ కోరారు.
నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రానికి చెందిన నితీష్ (23), నిహారిక (20) గత రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక ఈ ప్రేమికులు మేజర్లు కావడంతో జిల్లాలోని ఆర్య సమాజ్ లో ఈ నెల 15న వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం యువతి కుటుంబ సభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ నందిపేట పోలీసులను ఆశ్రయించారు. అయితే ఈ క్రమంలోనే యువతి కుటుంబ సభ్యులు నితీష్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడినట్లుగా సమాచారం.
దీంతో అక్కడ న్యాయం జరగకపోవడంతో ప్రేమికులు వెంటనే ఆర్మూరు ఏసీపీ కార్యాలయానికి వెళ్లారు. కానీ, సమయానికి ఏసీపీ అందుబాటులో లేకపోవడంతో ఈ ప్రేమికులు గురువారం సీపీ కార్యాలయానికి వెళ్లారు. తమకు తమ కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ సీపీని వేడుకున్నారు. దీంతో వెంటనే స్పందించిన పోలీస్ ఉన్నతాధికారులు.. యువతి, యువకుడి తల్లిదండ్రులను పిలిపించి వారికి కౌన్స్ లింగ్ ఇచ్చి పంపించారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ఈ ప్రేమ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
— Hardin (@hardintessa143) March 28, 2023