సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజ్ పేరు మార్మోగుతోంది. ఖైదీ, మాస్టర్.. ఇప్పుడు తాజాగా విక్రమ్ సినిమాతో వరుస బ్లాక్ బస్టర్ లను ఖాతాలో వేసుకున్నాడు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా తక్కువ బడ్జెట్ లో సైలెంట్ గా సినిమాలు తీసి హిట్స్ కొడుతున్నాడు లోకేష్. ఎవరి ఊహలకు అంచనాలకు అందకుండా.. ఎక్కడా క్లూ వదలకుండా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో హాట్ టాపిక్ గా మారాడు. అయితే.. హీరో కార్తీతో తెరకెక్కించిన ఖైదీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనం సృష్టించిందో చెప్పక్కర్లేదు.
ఓ ఖైదీ పోలీసులను కాపాడటం అనే కొత్త లైన్ తో రూపొందించిన ఆ సినిమా మంచి పేరుతో పాటు.. సెకండ్ పార్ట్ ఎప్పుడొస్తుందా అనే ఆసక్తిని క్రియేట్ చేసింది. ఆ తర్వాత.. ఖైదీ సినిమా తర్వాత విజయ్ తో మాస్టర్ తీశాడు. ఇటీవల విశ్వనటుడు కమల్ హాసన్ తో ‘విక్రమ్’ తెరకెక్కించి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్నాడు. అయితే.. లోకేష్ కి విజయ్, కమల్ హాసన్ లు అవకాశాలు ఇవ్వడానికి ప్రధాన కారణం కూడా ఖైదీనే అని చెప్పాలి. ఆ సినిమాలో లోకేష్ టేకింగ్.. వేరే లెవెల్ లో ఉందని వాళ్లే ప్రశంసించారు.
ఇదీ చదవండి: అప్పుడు ఖైదీ.. మధ్యలో మాస్టర్.. ఇప్పుడు విక్రమ్! లోకేశ్ కనగరాజ్ అంతా ప్లాన్ గా చేశాడా?ఇక ఖైదీ, విక్రమ్ సినిమాల కథలకు లింక్ ఉన్నప్పటికీ, మాస్టర్ కి మాత్రం సంబంధం లేదు. నిజానికి ఖైదీ రిలీజ్ అయినప్పుడే దానికి సీక్వెల్ ఉంటుందని లోకేష్ చెప్పడం జరిగింది. అప్పటినుండి సీక్వెల్ కోసం ఎదురు చూస్తుండగా.. విక్రమ్ సినిమా తీసి.. దానికి ఖైదీ లైన్ ని లింక్ చేసి సర్ప్రైజ్ చేశాడు. తాజాగా లోకేష్ కనకరాజ్ ఓ ఇంటర్వ్యూలో ఖైదీ-2 స్టోరీ లైన్ రివీల్ చేశాడు.
ఖైదీ-2 గురించి మాట్లాడుతూ.. సీక్వెల్ లో హీరో ఢిల్లీ జైలు జీవితం ఎలా గడిచింది? అనే ఫ్లాష్ బ్యాక్ తో సినిమా మొదలవుతుంది. జైల్లో ఢిల్లీ మేటి కబడ్డీ ఆటగాడు. ఆ తర్వాత మాఫియా ముఠా నుంచి పోలీసులను కాపాడి, తన కూతురును తీసుకుని వెళ్లిపోతాడు. మళ్లీ పోలీసులకు ఢిల్లీ అవసరం వస్తుంది. అందుకు దారి తీసిన పరిస్థితులు, ఆ తర్వాత చోటుచేసుకునే పరిణామాలతో సీక్వెల్ కథ ఉంటుందని చెప్పాడు.
ఇక విక్రమ్ లో ఢిల్లీని ఎందుకు చూపించలేదు? అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చాడు లోకేష్. “సినిమాలో కార్తీ సర్, సూర్య సర్ కలిసే మూమెంట్ మ్యాజిక్ వేరే లెవెల్ లో ఉంటుంది. అందుకే విక్రమ్ లో ఢిల్లీని చూపించలేదు. అంతెందుకు ఖైదీలో కనిపించిన కానిస్టేబుల్ నెపోలియన్ రోల్ కూడా విక్రమ్ లో ఉంది. హ్యూమన్ రైట్స్ అధికారులు వచ్చి స్టేషన్ లోని మెషిన్ గన్ ని ఢిల్లీ ఎలా తీశాడని అడుగుతారు. ఆ సీన్స్ తర్వాత పార్ట్స్ లో వాడుకోవచ్చని ఎడిటింగ్ లో తీయించేశాను” అని చెప్పాడు లోకేష్. ప్రస్తుతం లోకేష్ మాటలు వింటుంటే.. మున్ముందు లోకేష్ సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో అనే అంచనాలు పెరుగుతున్నాయి. మరి లోకేష్ మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
.@Dir_Lokesh Latest Interview About @Suriya_offl & Dilli #Rolex Faceoff… “The Purpose of creating this universe is to Meet up with each character” pic.twitter.com/uGQprXB4d6
— ʀᴏʟᴇx ᴤɪʀ~𝐌𝐚𝐬𝐒𝐮𝐫𝐢𝐲𝐚 (@masshihab_offl) June 9, 2022