టాలీవుడ్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ‘లైగర్’. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా.. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. అటు డైరెక్టర్ పూరికి, ఇటు హీరో విజయ్ దేవరకొండకు ఇదే ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. అదీగాక ఇప్పటికే లైగర్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఫ్యాన్స్ లో సినిమాపై అంచనాలు పెంచేశారు మేకర్స్.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన లైగర్ నిర్మాణంలో.. పూరి జగన్నాథ్, ఛార్మిలతో పాటు బాలీవుడ్ అగ్రనిర్మాత కరణ్ జోహార్ కూడా భాగమవ్వడంతో ఈ సినిమాకు హిందీలోనూ మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో లైగర్ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీస్థాయిలో జరిగినట్లు తెలుస్తుంది.
ఇక లైగర్ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ దాదాపు 106 కోట్లకు అమ్ముడుపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో 92 కోట్లకు డిజిటల్ – శాటిలైట్ హక్కులను స్టార్ గ్రూప్ సొంతం చేసుకోగా.. లైగర్ ఆడియో రైట్స్ ని దాదాపు 14 కోట్లకు సోనీ మ్యూజిక్ వారు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ సినిమాలో విజయ్ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. మరి లైగర్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.