Salman Khan: ప్రముఖ పంజాబీ సింగర్ సింధు మూసేవాలా దారుణ హత్య దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఈ హత్యను తానే చేయించినట్లు గ్యాంగ్‌స్టర్ గోల్డీబ్రార్ ప్రకటించాడు. గ్యాంగ్‌స్టర్ విక్కీ మిద్దుఖెర హత్యకు ప్రతీకారంగానే సింధు మూసేవాలను హత్య చేసినట్లు వెల్లడించాడు. కెనడాలో ఉండే గోల్డీబ్రార్.. మోస్ట్‌వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిస్‌నోయ్ గ్యాంగ్‌కు అత్యంత సన్నిహితుడు. సింగర్ హత్యలో లారెన్స్ హస్తం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ గ్యాంగ్‌స్టర్‌లు ఇద్దరూ ఓ పథకం ప్రకారం ఈ హత్య చేయించినట్లు సమాచారం. సింధు హత్య నేపథ్యంలో బాలీవుడ్ కండల వీరుడు ‘సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర’ ఉదంతం మరోసారి తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం లేకపోలేదు.
2018లో సల్మాన్ ఖాన్‌ను చంపుతానని, సింగర్ హంతకుల్లో ఒకడైన లారెన్స్ బిస్‌నోయ్ ప్రకటించాడు. అది కూడా జైలులో ఉండగానే ఈ సవాల్ విసిరాడు. లారెన్స్.. సల్మాన్ ఖాన్‌ను చంపుతాననటానికి కూడా ఓ కారణం ఉంది. సల్మాన్ 1998లో కృష్ణ జింకను వేటాడి చంపాడు. లారెన్స్ బిస్‌నోయ్ జాతికి చెందిన వాడు. ఈ జాతి వారికి కృష్ణ జింకలు దైవ సమానం. తమకు దైవ సమానమైన కృష్ణ జింకను చంపాడని లారెన్స్.. సల్మాన్‌పై పగ పెంచుకున్నాడు. సల్మాన్‌ను చంపుతానని జైలు నుంచే హెచ్చరికలు జారీ చేశాడు.
ఆ బెదిరింపులు కేవలం మాటలకు మాత్రమే పరిమితం కాలేదు. ఓ పక్కాప్లాన్ కూడా జరిగిపోయింది. ‘రెడీ’ సినిమా షూటింగ్ సమయంలో సల్మాన్‌ను చంపటానికి లారెన్స్ గ్యాంగ్ ప్లాన్ చేసింది. అయితే, చివరి క్షణంలో లారెన్స్‌కు సరైన ఆయుధం దొరకపోవటంతో హత్యా ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కానీ, సింగర్ సింధు విషయంలో అలా జరగలేదు. పక్కా ప్లాన్‌తో ఈ నెల 29న అతడ్ని దారుణంగా కాల్చి చంపారు. మరి, సల్మాన్ ఖాన్ హత్యకు కుట్రపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Nora Fatehi: బాహుబలి భామపై నెట్టింట ట్రోలింగ్! బుద్ది లేదా అంటూ రెచ్చిపోయారు!