పెళ్లికి ముందు జరుపుకునే నిశ్చితార్థ వేడుకలు ఎవరి హోదాకు తగ్గట్లు వారు జరుపుకుంటారు. సెలబ్రిటీలైతే కాస్త కాస్ట్లీగా ప్లాన్ చేసుకుంటుంటారు. ఎంగేజ్మెంట్ వేదిక నుంచి ధరించే డ్రెస్సులు, ఆభరణాలు ఇలా ప్రతీది ఖరీదైనవిగా ఉంటాయి. ఇటీవల ఎంగేజ్మెంట్ జరుపుకున్న వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి, ఆవేడుకలో లావణ్య ఖరీదైన చీర ధరించి మెరిసిపోయింది.
టాలీవుడ్ స్టార్ హీరో మెగా ప్రిన్సెస్ వరుణ్ తేజ్, ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కొంత కాలం నుంచి ప్రేమించుకుంటున్నారని, త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్నారని టాలీవుడ్ కోడై కూసింది. అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుక జరుపుకున్నారు. మరి కొద్ది రోజుల్లో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని మెగా వారి ఇంట్లో అడుగుపెట్టనుంది లావణ్య త్రిపాఠి. అయితే అంగరంగ వైభవంగా జరిగిన వీరి ఎంగేజ్మెంట్ వేడుకలో లావణ్య చీటకట్టులో మెరిసింది. ఆ చీరలో ఆమె మరింత అందంగా కనిపించింది. లావణ్య ధరించిన ఆ చీర ధర ఎంతో తెలుసా.. అయితే చీర ధర వివరాలు తెలుసుకుందాం పదండి.
చీరకట్టులో మగువలు మరింత అందంగా కనిపిస్తారు. చీర సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేస్తుంది. సాధారణంగా ఫంక్షన్లప్పుడు యువతులు చీరలు కట్టుకుని మురిసిపోతుంటారు. అయితే ఇక్కడ డబ్బున్న వారు కాస్త ఖరీదైన చీరలను ధరిస్తారు. ఒక్క చీర ఏంటి వారు ధరించే ఆభరణాలు కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇక సెలబ్రిటీల విషయానికి వస్తే వారికి ప్రత్యేకంగా డిజైనర్స్ ఉంటారు. వారు ఆ సెలబ్రిటీకి తగిన కాస్ట్యూమ్స్ ను అందిస్తారు. ఇక లావణ్య-వరుణ్ తేజ్ నిశ్చితార్థ వేడుకలో సాంప్రదాయ దుస్తుల్లో మెరిసారు. వరుణ్ తేజ్ కుర్తా పైజామా ధరిస్తే, లావణ్య త్రిపాఠి ఆకుపచ్చ రంగు బనారస్ చీర ధరించి అందంగా కనిపించారు. బనారస్ చీరలో లావణ్య త్రిపాఠి మెరిసిపోయింది.
అయితే ఆ చీర ధర ఎంతంటూ నెటిజెన్స్ తెగ వెతికేస్తున్నారు. ఆ చీర ధర అక్షరాల రూ. 75వేల రూపాయలు. దీనిని అనితా డోంగ్రే అనే ఫ్యాషన్ డిజైనర్ డిజైన్ చేశారు. ఈ చీరలో లావణ్య త్రిపాఠి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మెగా ఇంటకి కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి లక్షరూపాయల చీర ధరించినా తక్కువే అవుతోందని సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. కాగా జూన్ 09న ఈ లవ్ కపుల్ రింగులు మార్చుకుని ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. ఈ వేడుకకు మెగా ఫ్యామిళీ మెంబర్స్ హాజరయ్యారు. త్వరలో పెళ్లి ముహూర్తంతో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ జంటకు సినీ రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Found my Lav!♥️@Itslavanya pic.twitter.com/OCyhWcIjMq
— Varun Tej Konidela (@IAmVarunTej) June 9, 2023