శ్రీరెడ్డి.. గత 4-5 ఏళ్ల నుంచి ఈమె పేరు ట్రెండింగ్‌లో ఉంది. బోల్డ్ అండ్ డేరింగ్ క్యారెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎలా ఉంటాయో ధైర్యంగా వెల్లడించింది. అంతేకాక.. ఈ సమస్యకు పరిష్కారం సూచించాలని డిమాండ్ చేస్తూ.. ఫిల్మ్ చాంబర్ దగ్గర అర్ధనగ్న ప్రదర్శనతో దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక అప్పటి నుంచి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఇష్యూతో ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసింది. ఎందరో రాజకీయ, సినీ ప్రముఖులకు నిద్ర లేకుండా చేసింది. ఇక సందర్భం వచ్చిన ప్రతి సారి ఎవరో ఒకరి మీద ఆరోపణలు చేస్తూ ఉంటుంది. అటు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటుంది.
శ్రీరెడ్డి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో వంటల వీడియోలు వంటివి పోస్ట్ చేస్తూ.. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటుంది. ఇక ఇవే కాకుండా తమిళ మీడియాలో పాపులర్ అయ్యేందుకు అక్కడి యూట్యూబ్ ఛానల్స్‌కి వరుస ఇంటర్వ్యూలను ఇస్తుంది. శ్రీరెడ్డి ఇంటర్వ్యూలకు తమిళ్‌లో కూడా మంచి ఆదరణతో ఉండటంతో ఆమె ఇంటర్వ్యూల కోసం అక్కడి యూట్యూబ్ చానెల్స్ కూడా ఆసక్తి కనబరుస్తాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీరెడ్డి ఓ తమిళ్ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చింది.
అయితే రొటీన్‌గా ఇంటర్వ్యూ చేస్తే ఏం బావుంటుందని అనుకుందో ఏమో కానీ.. వన్ డే నైట్ డేటింగ్ అంటూ సదరు యూట్యూబ్ ఛానల్ యాంకర్‌తో నైట్ జర్నీ చేస్తూ తనదైన శైలిలో ఇంటర్వ్యూ ఇచ్చింది. యాంకర్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో బోల్డ ఆన్సర్లు ఇస్తూ.. ఇంటర్వ్యూ కొనసాగించింది. ఇక ఆఖర్లో శ్రీరెడ్డి యాంకర్ ఇచ్చిన వెరైటీ చాలెంజ్‌కి ఓకే చెప్పింది.
ఇప్పటివరకూ ఎవరి దగ్గరైనా ఫోన్ నెంబర్ తీసుకున్నారా? అని ఆ యాంకర్ అడగడంతో లేదని చెప్పింది శ్రీరెడ్డి. అయితే ఈ రాత్రి పూట కారు దిగి వెళ్లి నెంబర్ తీసుకుని వస్తావా.. అని అడగడంతో.. హో ఎస్ అనేసింది శ్రీరెడ్డి. అనడమే కాదు.. వెంటనే కారు దిగి వెళ్లి.. కవ్విస్తూ నెంబర్లు కనుక్కునే ప్రయత్నం చేసింది. రాత్రి పూట రోడ్డుపై వెళ్తున్న బైకర్స్‌ని ఆపి మరీ నెంబర్లు అడిగింది శ్రీరెడ్డి. అర్ధరాత్రి పూట రోడ్లుపై బైక్‌లు ఆపుతున్న ఈ బ్యూటీ ఎవరు అని ఆగేవాళ్లు కొందరైతే.. శ్రీరెడ్డి సొగసులు చూసి బైక్‌లు ఆపి.. నెంబర్లు ఇచ్చేందుకు ఉత్సాహం చూపించారు మరికొందరు.. మొత్తానికైతే చెన్నై రోడ్లపై శ్రీరెడ్డి చేసిన హంగామా వైరల్ అవుతోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.