నయనతారను సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా ఫోర్బ్స్ కవర్ పేజీపై చోటు దక్కించుకుని నయనతార తన రేంజ్ ఇంకా పెంచేసుకుంది. సక్సెల సంగతి పక్కన పెడితే నయనతార నుంచి అభిమానులు ఎదురుచూస్తున్న వార్త ఆమె వివాహం ఎప్పుడు అనేదే. ఇప్పటికే నయనతార, విఘ్నేశ్‌కు నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. కానీ ఆర్థికంగా స్థిరపడిన తర్వాతే వివాహం చేసుకోవాలని నయనతార, విఘ్నేస్ ఫిక్స్ అయ్యారు. తాజాగా వారి వివాహానికి సంబంధించిన ఒక వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. విఘ్నేశ్ కంటే ముందు నయనతారకు ఒక చెట్టుతో వివాహం జరుగుతుంది అని టాక్ మొదలైంది.
ఇదీ చదవండి: టీ- ట్వంటీ వరల్డ్ కప్ ముందు ఫ్యాన్స్ కి శుభవార్త. కలసిపోయిన రోహిత్ శర్మ, కోహ్లీ!
నయనతార జాతకం ప్రకారం ఆమెకు ఒక చెట్టుతో వివాహం చేయాలి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. నయనతార జాతకంలో కుజ దోషం ఉందని.. ఆమెకు చెట్టుతో వివాహం చేయాలని చెప్తున్నారు. ఈ విషయం మీద అధికారిక సమాచారం ఏమీ లేదు. అంతా పుకార్లు మాత్రమే. కానీ, అది ఎంతవరకు నిజం అన్నది నయనతార లేదా విఘ్నేష్ తరఫున వారు ప్రకటిస్తేనే తెలుస్తుంది. గతంలో ఐశ్వర్యరాయ్ కూడా చెట్టును వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు నయనతార కూడా అదే బాటలో వెళ్తోంది అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. మరోవైపు సినిమాల పరంగానూ నయనతార ఫుల్ జోష్‌లో ఉంది. ఈ దీపావళికి నయనతార నటించిన కాతు వాకుల రెండు కాదల్ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాలో సమంత కూడా కీ రోల్ ప్లే చేస్తోంది. నయనతార ఖాతాలో కచ్చితంగా మరో విక్టరీ నమోదు కాబోతోంది అంటూ అభిమానులు ఇప్పటికే ప్రచారాలు మొదలు పెట్టారు కూడా.