సాధారణంగా ఫేవరేట్ సెలబ్రిటీలు కనిపించినప్పుడు అభిమానులలో కలిగే ఆ ఆనందం వేరే లెవెల్ లో ఉంటుంది. ఇంతకాలం సోషల్ మీడియాలో, టీవీలో చూసి ఆరాధించిన సెలబ్రిటీ.. ఒక్కసారిగా ఎదురుపడేసరికి అభిమానాన్ని ఎలా బయట పెట్టాలో అలా ఉండిపోతారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కి ఫేవరేట్ స్టార్ కనిపిస్తే ప్రపోజ్ చేస్తుంటారు.. లేదా సెల్ఫీ అడుగుతుంటారు. కానీ.. అప్పుడప్పుడు అరుదుగా కొందరు ఫ్యాన్స్ తమ అభిమాన స్టార్ గురించి కవితలు రాసుకొచ్చి చదివి సర్ప్రైజ్ చేస్తుంటారు.
ఇటీవల అలాంటి సర్ప్రైజ్ కి గురయ్యాడు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన షణ్ముఖ్.. బిగ్ బాస్ లో అడుగుపెట్టి తన ఫ్యాన్ ఫాలోయింగ్ రెట్టింపు చేసుకున్నాడు. సాఫ్టువేర్ డెవలపర్. సూర్య వెబ్ సిరీస్ లతో ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసిన షన్ను.. తాజాగా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటించాడు. ఆ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగు ఓటిటి ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఆ వెబ్ సిరీస్ కోసం ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏజెంట్ ఆనంద్ సంతోష్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా కేఎల్ యూనివర్సిటీలో సందడి చేసింది షన్ను బృందం. అయితే.. షన్ను ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి తెలిసిందేగా.. షన్నుని చూసి అమ్మాయిలంతా అరుపులు కేకలతో ఈవెంట్ ని హోరెత్తించారు. ఇక ఓ లేడీ ఫ్యాన్ ఏకంగా షన్ను కోసం ఓ కవిత కూడా రాసుకొచ్చింది. ఎంతో ప్రేమగా, సరదాగా రాసిన ఆ కవితను అందరి ముందు మైక్ లో చెప్పేసింది. దీంతో సదరు అమ్మాయి చెప్పిన కవిత విని షన్ను సిగ్గుపడ్డాడు.
ఇంతకీ షన్ను లేడీ ఫ్యాన్ చెప్పిన కవిత ఏంటంటే.. “షన్ను.. నీ మాయలోకి లాగేశావు నన్ను.. నీ గురించి రాస్తుంటే ఆగట్లేదు నా పెన్ను.. కలవడానికి ఎప్పటినుండో వేచిచూస్తున్న నిన్ను.. కుదిరితే ఒక సెల్ఫీ ఇస్తావని ఇలా నీ ముందు నిలుచున్నా నేను!” అని ఇండైరెక్ట్ గా సెల్ఫీ అడిగింది. మరి షన్నుతో సెల్ఫీ తీసుకుందో లేదో తెలియదు. కానీ.. ప్రస్తుతం షన్ను కోసం ఆ అమ్మాయి చదివిన కవిత నెట్టింట బాగా వైరల్ అవుతోంది. మరి షన్ను ఫ్యాన్ కవితపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.