నందమూరి కళ్యాణ్ రామ్ చాలా ఏళ్ళ తర్వాత బింబిసార సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని నమోదు చేశాడు. కంటెంట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా సినిమాలను ఆదరిస్తారని నమ్మి.. ఈ సోషియో ఫాంటసీ సబ్జెక్టుతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు. కంటెంట్ గెలుస్తుందని నమ్మకాన్ని నిలబెడుతూ ప్రేక్షకులు బింబిసార మూవీని బ్లాక్ బస్టర్ చేసిచ్చారు. కమర్షియల్ హంగులు జోడించిన బింబిసార కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో 'బింబిసార' చిత్రానికి బ్రహ్మరథం పట్టారు ప్రేక్షకులు. గత రెండు నెలల తర్వాత ఈ సినిమాకు బెస్ట్ ఓపెనింగ్స్ రావడం విశేషం. కళ్యాణ్ రామ్ చివరి సినిమా ఓపెనింగ్స్ కి బింబిసార రెట్టింపు తెచ్చిందని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి బింబిసార మొదటిరోజు రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు తెలుస్తుంది. తెలుగు రాష్ట్రాలలో ఏరియాల వారీగా 'బింబిసార' ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినట్లయితే.. నైజాం: రూ. 2.15 కోట్లు ఉత్తరాంధ్ర: రూ. 90 లక్షలు సీడెడ్: రూ. 1.29 కోట్లు నెల్లూరు: రూ. 26 లక్షలు గుంటూరు: రూ. 57 లక్షలు కృష్ణా జిల్లా: రూ. 34 లక్షలు తూర్పు గోదావరి: రూ. 43 లక్షలు పశ్చిమ గోదావరి: రూ. 36 లక్షలు బింబిసారకు ఏపీ, తెలంగాణ కలిపి మొత్తం 6.30 కోట్ల రూపాయల షేర్ లభించింది. గ్రాస్ పరంగా.. 9.30 కోట్ల అని ట్రేడ్ వర్గాల సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్‌ను సుమారు 13.5 కోట్ల రూపాయలకు విక్రయించారు. ఆరున్నర కోట్లు అంటే సుమారు 50 శాతం రికవరీ అయినట్టే! ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ రావడంతో బింబిసార మరిన్ని భారీ వసూళ్లు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. ఓవర్సీస్ లో కూడా బింబిసార మంచి కలెక్షన్స్ నమోదుకే చేసింది. ఫస్ట్ డే 74, 628 డాలర్లు రాబట్టగా.. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ. 32 లక్షలు, వరల్డ్ వైడ్ గా రూ. 7.7 కోట్ల షేర్.. రూ. 11.5 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. ఈ వీకెండ్ కూడా వర్కౌట్ అయితే.. నిర్మాతలకు లాభాలు వస్తాయని, సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాల టాక్. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ డ్యూయల్ రోల్ చేశాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ .కె ఈ చిత్రాన్ని నిర్మించారు. డెబ్యూ డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వం వహించారు. మరి బింబిసార మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. #Bimbisara 1st Day Total WW Collectionshttps://t.co/xOjCd0hVij 47% Recovery!! Terrific start! pic.twitter.com/Lt5nZauvrl — AndhraBoxOffice.Com (@AndhraBoxOffice) August 6, 2022