సెలబ్రిటీలకు ఉండే ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. హీరోలైనా, హీరోయిన్లకైనా ఉండే క్రేజే వేరు. ఏ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కో లేదా ఏ ఈవెంట్ కో వస్తే అభిమానులు అక్కడ వాలిపోతారు. అయితే తమ ఫేవరెట్ హీరోతో గాని, హీరోయిన్ తో గాని ఒక్క సెల్ఫీ తీసుకోవాలని ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంటారు. అలాంటి వారికి తమ అభిమాన నటులు పిలిచి మరీ సెల్ఫీ దిగితే ఆ ఆ అభిమాని ఆనందానికి మించినది మరొకటి ఉండదు. అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడినప్పుడు బౌన్సర్లు పక్కకి గెంటి వేసినప్పుడు.. చాలా మంది హీరోలు, హీరోయిన్లు అభిమానులను పిలిచి మరీ సెల్ఫీలిచ్చిన ఘటనలు గతంలో చాలా చూసాం.
తాజాగా కృతి సనన్ ఓ అభిమానికి పట్ల చాలా కూల్ గా స్పందించారు. ఒక పార్టీకి అటెండ్ అయిన కృతి సనన్ తో సెల్ఫీ దిగాలని ఒక అభిమాని చాలా సేపటి నుండి ఎదురుచూస్తున్నారు. కృతి సనన్ ని ఆ అభిమాని సెల్ఫీ అడిగారు. కృతి సనన్ అభిమానికి షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో అతని హైట్ చూడండి అంటూ మీడియా వాళ్ళు వెక్కిరించారు. అలా మాట్లాడకండి అంటూ వారి మీద కోప్పడ్డారు. ఆ తర్వాత అభిమాని ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎంత మృదు స్వభావి, ఎంత దయ గల మా తల్లి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మరి బాడీ షేమింగ్ చేసిన మీడియా వాళ్లకి కౌంటర్ ఇస్తూ అభిమానితో సెల్ఫీ దిగిన కృతి సనన్ పై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.