సినిమా రంగంలో రాణించాలంటే ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ఎదుర్కొని నిలబడి రాణించాల్సి ఉంటుంది. అప్పుడప్పుడు వేధింపులు, అవమానాలు కూడా చోటుచేసుకుంటాయి. వాటిని దాటుకుని ముందుకు పోతేనే నటీ నటులుగా సక్సెస్ అవుతారు.
సినిమా రంగంలో హీరో హీరోయిన్స్ పై గాసిప్స్, రూమర్స్ కామన్ గా వినిపిస్తూనే ఉంటాయి. ఒక్కొక్కసారి నటీనటులు వారికి తెలియకుండానే వివాదాల్లో చిక్కుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయానికి వస్తే గాసిప్స్ బెడద ఎక్కువగా ఉంటుంది. దీంతో వారికి సినిమారంగంలో అవకాశాలు తగ్గి కెరీర్ లో నష్ట పోయే ప్రమాదం ఉంటుంది.
నటి కృతిసనన్ బాలీవుడ్, టాలీవుడ్ కు సంబంధించిన పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో కలిసి ఆదిపురుష్ సినిమాలో నటించింది. డైరెక్టర్ ఓ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కృతిసనన్ సీత పాత్రలో అలరించనుంది. ఇటీవల తిరుపతిలో ఆదిపురుష్ ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ తరువాత దర్శకుడు ఓం రౌత్ , కృతి సనన్ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం తిరువలకు వెళ్లారు. అక్కడ దర్శన అనంతరం కృతి సనన్ కు దర్శకుడు ముద్దు పెట్టి, కౌగిలించుకోవడంతో వివాదం చెలరేగింది.
శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఆదిపురుష్ సినిమా ప్రమోషన్ లో భాగంగా హీరోయిన్ కృతి సనన్ ఓ ఇంటర్వ్యూకి హాజరయ్యింది. అందులో సినీ కెరీర్ కు సంబంధించిన పలు విషయాలను వెల్లడించింది. తనకు మోడలింగ్ అంటే ఇష్టమని ఆ కారణంతోనే ఢిల్లీ నుంచి ముంబై వచ్చినట్లు తెలిపింది. ఈ క్రమంలో తనకు జరిగిన అవమానం గురించి తెలిపింది. ఓ ర్యాంప్ షోలో కొరియోగ్రాఫర్ అందరు చూస్తుండగానే తనతో అసభ్యంగా ప్రవర్తించి అవమానించాడని చెప్పింది. ఈ పరిణామంతో మోడలింగ్ వదిలేసి ఇంటికి వెళ్లిపోదామని అనుకున్నట్లు తెలిపింది. అయితే తన తల్లి ఇచ్చిన దైర్యంతో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని తెలిపింది.