సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు తన నటవారసుడు యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ పెళ్లి, రాధేశ్యామ్ సినిమాపై స్పందించారు. టాలీవుడ్‌లోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ప్రభాస్ త్వరగా పెళ్లి చేసుకోవాలని, ప్రభాస్ బిడ్డను ఎత్తుకుని ఆడించాలని ఉందని కృష్ణంరాజు పేర్కొన్నాడు. అలాగే ప్రభాస్ హీరోగా, రాధ కృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా ఈ శుక్రవారం విడుదలైన రాధేశ్యామ్ సినిమాపై స్పందించిన ఆయన.. సినిమా చాలా బాగుందని, ముఖ్యంగా సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉందన్నారు.
అలాగే బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబచ్చన్ రాధేశ్యామ్‌ను ప్రశంసించినట్లు తెలిపారు. హిందీ వెర్షన్‌లో తన పాత్రకు ఆయన డబ్బింగ్ చెప్పినట్లు వెల్లడించారు. కాగా కృష్ణంరాజు రాధేశ్యామ్‌లో ఒక పాత్ర చేసిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సినిమాకు తొలుత డివైడ్ టాక్ వచ్చినా కలెక‌్షన్ల పరంగా ఘనవిజయం సాధించింది. ఇప్పటికే రికార్డు స్థాయి కలెక‌్షన్లు కురిపిస్తుంది. మరి రాధేశ్యామ్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: రియల్ లైఫ్ విక్రమాదిత్య..! రాధే శ్యామ్ లో ప్రభాస్ లాగా..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App ని డౌన్లోడ్ చేసుకోండి.