ప్రస్తుతం ఇండస్ట్రీలో హోం టూర్ల హవా నడుస్తోంది. సెలబ్రిటీలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. కొందరైతే ఏకంగా యూట్యూబ్ ఛానెల్స్ నే రన్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరికొందరు డబ్బు కోసం కాకుండా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే హీరో సుపర్ స్టార్ కృష్ణ కుమార్తె తన తండ్రి హోం టూర్ చేశారు. అందులో భాగంగానే విజయ నిర్మలకు సంబంధించిన పలు ఆసక్తి కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వివరాల్లోకి వెళితే..
సూపర్ స్టార్ కృష్ణ– విజయ నిర్మల జోడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలనాటి అందాల జోడిగా ప్రేక్షకుల మనసు దోచారు. వీరు మెుదటి సారి ‘సాక్షి’ అనే సినిమాతో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి వీరి మధ్య ప్రేమ చిగురించడంతో ఇంతకు ముందే పెళ్లి అయినా కాని మళ్లీ రెండవ పెళ్లి చేసుకున్నారు.
కృష్ణకు విజయ నిర్మల అంటే అమితమైన ప్రేమ. అందుకే ఆమెకు సంబంధించిన ఏ చిన్న వేడుకైనా చాలా ఘనంగా జరిపించే వాడు. ఇక ఆమె మరణం తరువాత కృష్ణ బయటికి రావడమే తగ్గించారు. ఆమెకు సంబంధించిన అనుభుతులతోనే తన శేష జీవితాన్ని గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణ కుమార్తె గట్టమనేని మంజుల తీసిన హోం టూర్ ద్వారా విజయ నిర్మల కాంస్య విగ్రహాం వెలుగులోకి వచ్చింది. దీంతో ఈ విగ్రహాన్ని చూసిన వారంతా భార్యపై ఎంత ప్రేమ ఉంటే ఇలా విగ్రహాం చేయిస్తాడు.. అంటూ చెప్పుకుంటున్నారు. సుపర్ స్టార్ ని పొగుడుతూ ఉన్నారు.
అదీ కాక ఆమెకు సంబంధించిన చాలా రకాల అవార్డులను సైతం ఆయన ఆమె గుర్తుగా భద్రపరుచుకున్నాడు.
ఈ క్రమంలోనే నిర్మల సింగిల్ ఫొటో కోసం కృష్ణ చాలా వెతికారట.. కానీ ఎక్కడ చూసిన తాము ఇద్దరు కలిసి దిగిన ఫొటోలే కనిపిస్తున్నాయట. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒకరంటే ఒకరికి ఎంత ప్రేమో. విజయ నిర్మల కొడుకు నరేష్ కూడా తన తల్లి బంగారు పాదాలు చేయించి పూజిస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆమెకు సంబంధించిన ఈ విగ్రహాం వార్తల్లో నిలిచింది. భర్యపై తనకున్న ప్రేమను ఇలా తెలియజేసిన సుపర్ స్టార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.