తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలీ, నందమూరి ఫ్యామిలీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ రెండు ఫ్యామిలీల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గతంలో ఇరు కుటుంబాల హీరోలు బాక్సాఫీస్ వద్ద నువ్వానేనా అన్నట్లు పోటీపడే వారు. అలా ఈ రెండు కుటుంబాల నుంచి వచ్చిన అనేక సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అలాంటి రెండు ఫ్యామిలీల హీరోలు కలిసి ఏ సినిమాలో కనిపిస్తే ఇక బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ఇది ఇంతక ముందే "ఆర్ఆర్ఆర్" చిత్రం ద్వారా రుజువైంది. రామ్ చరణ్, యన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. అయితే తాజాగా ఈ రెండు ఫ్యామిలీ హీరోలకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. మెగా, నందమూరి హీరోలు ఇద్దరు బావ బామ్మర్ది పాత్రలో ఒకే సినిమాలో నటిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం యన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. యన్టీఆర్ 30వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమా ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి ఇంకా చాలా సమయం పడుతుందట. యన్టీఆర్, శివ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాకు సంబంధించి రెగ్యులర్ షూటింగ్ ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుందంట. అయితే ఎన్టీఆర్ సినిమాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా నటించబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అందులో జూనియర్ ఎన్టీఆర్ బామ్మర్దిగా సాయి ధరమ్ తేజ్ పాత్ర ఉండనున్నట్లు గుస్సగుస్సలు వినిపిస్తోన్నాయి. ఇందులో సాయి ధరమ్ తేజ్ పాత్రకు జోడీగా ఓ హీరోయిన్ ఉందట. అయితే వార్తకు సంబంధించి ఆ మూవీ యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. అంతే కాక ఇటు మెగా కాంపౌండ్ నుంచి గానీ, నందమూరి కాంపౌండ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన రాలేదు. ఒక వేళ సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఈ వార్త కనుక నిజమైతే మెగా అభిమానులకు నందమూరి అభిమానులకు మరొకసారి మంచి ఎంటర్టైన్మెంట్ దొరికినట్టే అని చెప్పవచ్చు. మరి.. ఈ వార్తలు నిజా నిజాలు తెలియాలి అంటే అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే. మరి.. మెగా, నందమూరి హీరోల గురించి సోషల్ మీడియాలో చక్కర్ల కొడుతున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Anchor Anasuya: జబర్దస్త్ యాంకర్ గా అనసూయ లాస్ట్ ఎపిసోడ్.. లైవ్ లో ఏడ్చేసిన ఇంద్రజ! ఇదీ చదవండి: Anupama Parameswaran: తొలిసారి గ్లామర్ షోతో రెచ్చిపోయిన అనుపమ! ఇదీ చదవండి: Kings VS Queens: పాత గొడవల్ని బయటపెట్టుకుంటూ.. స్టేజ్‌పై కొట్టుకున్న సన్నీ, యాంకర్ రవి!