Sreeja: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు సంబంధించిన ఏ విషయమైనా తెలుసుకోవాలనే ఆసక్తి కనబరుస్తుంటారు అభిమానులు. అందులోనూ మెగా ఫ్యామిలీ అభిమానులు అంటే.. మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరు, రామ్ చరణ్ లు మొదలుకొని వారికి సంబంధించి ఏ స్పెషల్ డే అయినా సెలబ్రేట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అయితే.. తాజాగా మెగా డాటర్ శ్రీజ పెద్ద కూతురి 14వ బర్త్ డే సెలబ్రేట్ చేశారు మెగాఫ్యామిలీ.
మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. శ్రీజకు ఇద్దరు ఆడపిల్లలు. వారిలో పెద్దమ్మాయి పేరు నివృతి.. కాగా చిన్నమ్మాయి పేరు నవిష్క. ఇక జూలై 5న శ్రీజ పెద్ద కూతురు నివృతి 14వ పుట్టినరోజు సందర్భంగా బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకలో మెగాస్టార్ తో పాటు రామ్ చరణ్ కూడా పాల్గిన్నట్లు సమాచారం.
ప్రస్తుతం నివృతి బర్త్ డేకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో ‘నాకు అత్యంత విలువైన నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వు నాకు దొరికిన అద్భుతం. ఐ లవ్ యు సో మచ్’ అంటూ శ్రీజ కూతురితో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్ మనవరాలు నివృతికి మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెష్ తెలియజేస్తున్నారు. మరి వైరల్ అవుతున్న శ్రీజ కూతురి బర్త్ డే ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.