సౌత్ ఇండియాలో కెరీర్ ఆరంభం నుండి ప్లాప్స్ లేని డైరెక్టర్స్ చాలా తక్కువమంది ఉంటారు. అలాంటివారిలో ఒకరు ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాలెంటెడ్ డైరెక్టర్. కేవలం నాలుగు సినిమాలతో తన స్టామినా ఏంటో ప్రూవ్ చేసిన ఆ డైరెక్టర్.. తాజాగా తనకు పండంటి బాబు పుట్టాడనే విషయాన్ని ఎంతో సంతోషంగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా? మీకు తమిళ డబ్బింగ్ సినిమాలు రాజారాణి, అదిరింది, విజిల్, పోలీసోడు సినిమాలు గుర్తుండే ఉంటాయి. ఒక్కో మూవీతో తన క్రేజ్ పెంచుకుంటూ వెళ్లిన ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. అట్లీ కుమార్.
రాజారాణి సినిమా తప్ప మిగతా మూడు సినిమాలు దళపతి విజయ్ తో చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో ‘జవాన్’ సినిమా చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తనకు దేవుడి ఆశీస్సులతో కొడుకు పుట్టాడని, తన భార్య ప్రియా అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చిందని ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. దీంతో అట్లీ పోస్ట్ చూసిన నెటిజన్స్, ఫ్యాన్స్ అందరూ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా.. డైరెక్టర్ అట్లీ.. నటి కృష్ణ ప్రియను 2014లో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. దాదాపు పెళ్ళైన 8 ఏళ్ళ తర్వాత వీళ్ళు మొదటి బిడ్డకు జన్మనిచ్చారు.
ఇదిలా ఉండగా.. రీసెంట్ గా అట్లీ భార్య తాను ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు బేబీ బంప్ ఫొటోలతో పాటు బేబీ షవర్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ప్రియా కూడా నటిగా పలు తమిళ సినిమాలలో నటించింది. ముఖ్యంగా సీరియల్స్ తో పాటు పలు సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ గా, హీరో చెల్లి క్యారెక్టర్స్ చేసినట్లు తెలుస్తోంది. నటిగా సినిమాలు చేస్తున్నప్పుడే అట్లీతో పరిచయమై.. ప్రేమలో పడ్డారని సమాచారం. అట్లీతో పెళ్లి తర్వాత ప్రియా నటనకు దూరంగా ఉంటోంది. మరి డైరెక్టర్ అట్లీ – ప్రియాల గుడ్ న్యూస్ పై మీ విషెష్ కూడా కామెంట్స్ లో తెలియజేయండి.
They were right 😍 There’s no feeling in the world like this ♥️
And just like tat our baby boy is here! A new exciting adventure of parenthood starts today!Grateful. Happy. Blessed. 🤗♥️🙏🏼@priyaatlee pic.twitter.com/jCEIHSxlKB
— atlee (@Atlee_dir) January 31, 2023