సినిమా వాళ్లపై కామెంట్లు చేయటం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది. సినిమా వాళ్ల సోషల్ మీడియా ఖాతాల్లోకి వెళ్లి మరీ కామెంట్లు చేస్తున్నారు కొందరు. అది కూడా సెలెబ్రిటీలు ఇబ్బంది పడేలా ప్రవర్తిస్తున్నారు.
తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘ఖుష్భూ’. 1980,1990లలో ఈమె తెలుగు, తమిళ సినిమాల్లో స్టార్ హీరోయిన్గా వెలుగొందారు. అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. తమిళంలో అద్భుతమైన అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఆమె అభిమానులు ఆమెకు ఏకంగా గుడిని సైతం కట్టారు. సినిమాల్లో హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే ఆమె ప్రముఖ దర్శకుడు సుందర్‌ను పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. కూతుర్ల విషయంలో తమకు సంబంధం లేకపోయినా ఖుష్భూ కుటుంబం వివాదాల్లోకి రావాల్సి వస్తోంది. అవంతిక, అనందితల రూపం విషయంలో కొంతమంది నెటిజన్లు తరచుగా కామెంట్లు చేస్తూ ఉన్నారు. ఈ విషయంపై ఖుష్భూ అనేక సార్లు మండిపడ్డారు.
అయినా నెటిజన్లు తమ తీరును మార్చుకోవటం లేదు. తాజాగా కూడా ఓ వ్యక్తి అవంతిక, అనందితలపై ఓ తప్పు కామెంట్ చేశాడు. ఫిబ్రవరి 13న ఖుష్భూ తన ట్విటర్ ఖాతాలో తన ఇద్దరు కూతుర్లు కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ ఫొటోపై ఓ నెటిజన్ స్పందించాడు. ఆ ఇద్దరు ముక్కు సర్జరీ చేయించుకున్నారని అన్నాడు. దీంతో ఖుష్భూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నెటిజన్ కామెంట్‌పై స్పందిస్తూ.. ‘‘ 20, 22 సంవత్సరాల వయసు కలిగిన వారికి కత్తులతో సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏముంది?. చిన్న పిల్లల మీద ట్రోలింగ్స్ చేయటం సిగ్గుచేటు. కనీసం పిల్లలనైనా వదిలేయండి’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ పోస్టుపై స్పందిస్తున్న నెటిజన్లు ఖుష్భూకు మద్దతుగా నిలుస్తున్నారు. కామెంట్లు చేస్తున్న వారిపై మండిపడుతున్నారు. కాగా, ఖుష్భూ చైల్డ్ ఆర్టిస్ట్ తన కెరీర్‌ను స్టార్ట్ చేశారు. హిందీలో పలు సినిమాలు చేశారు. 1986లో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్గా మారారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేశారు. ప్రస్తుతం సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్నారు. మరి, నెటిజన్ కామెంట్‌కు ఖుష్భూ ఇచ్చిన స్పందనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Why would a 20 and a 22 yr old go under a knife?? It’s a shame when children are part of trolling. At least spare the kids. https://t.co/wJ3NSME5aN
— KhushbuSundar (@khushsundar) February 13, 2023