కేజీఎఫ్ సినిమా చూసినవారందరికీ రాకీభాయ్ క్యారెక్టర్ కి, రాకీ తల్లి శాంతమ్మ క్యారెక్టర్ కి ఎమోషనల్ కనెక్ట్ అయిపోతారు. ఆ స్థాయిలో ఎమోషన్ ని పండించారు నటులు యష్ – అర్చన జోయిస్. ఈ సినిమా రాకీ భాయ్ గా యష్ కి ఎంత పేరు తెచ్చిందో.. తల్లి శాంతమ్మగా నటించిన క్లాసికల్ డాన్సర్ అర్చనకు కూడా అంతే పేరు తీసుకొచ్చింది. అయితే.. కేజీఎఫ్ ముందువరకు అర్చన ఎవరో సినీ ఫ్యాన్స్ కి తెలియదు. ఇక ఎప్పుడైతే ఆమె పేరు కేజీఎఫ్ తో బయటకి వచ్చిందో.. ఆమె క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయాయి.
ప్రస్తుతం కేజీఎఫ్ సినిమాలు అందించిన విజయాన్ని ఆస్వాదిస్తున్న అర్చన గురించి ఎన్నో విషయాలను సుమన్ టీవీ టీంతో షేర్ చేసుకున్నారు. ఈ క్రమంలో అర్చన హోమ్ టూర్ కు సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది. మరి ఈ హోమ్ టూర్ వీడియో అర్చన.. తన కెరీర్ తో పాటు ఫ్యామిలీ, మ్యారేజ్, సినిమాలు ఇలా అన్ని విషయాలు చెప్పుకొచ్చారు. మరి రాకీ భాయ్ తల్లిగా నటించిన ఈ యంగ్ అండ్ డైనమిక్ యాక్ట్రెస్ హోమ్ టూర్ వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.