పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఎంతలా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మాఫియా గ్యాంగ్ స్టర్ రాకీ భాయ్ కి ఉన్న క్రేజ్ అలాంటిది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ చిత్రంలో కన్నడ స్టార్ యష్ హీరోగా నటించాడు. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఏప్రిల్ 14న వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఇటీవలే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ ప్రారంభించారు మేకర్స్.
ప్రస్తుతం కేజీఎఫ్ 2 ట్రైలర్ కి కూడా మాసివ్ రెస్పాన్స్ దక్కింది. అయితే.. ట్రైలర్ లో అద్భుతమైన విజువల్స్ తో పాటు రాకీ భాయ్ డైలాగ్స్ కూడా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలో రాకీ భాయ్ క్యారెక్టర్ కి డైలాగ్స్ రాసింది ఎవరా? అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. ఈ ప్రశ్నకు దర్శకుడు ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశాడని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కేజీఎఫ్ 2 ట్రైలర్ లో డైలాగ్స్ పవర్ ఫుల్ గా, బాగున్నాయంటే.. ఆ క్రెడిట్ అంతా హీరో యష్ కే దక్కుతుంది. ఎందుకంటే.. మీరేవైతే డైలాగ్స్ నచ్చాయని చెబుతున్నారో.. ఆ రాకీ భాయ్ డైలాగ్స్ అన్ని తానే రాసుకున్నాడని చెప్పుకొచ్చాడు దర్శకుడు ప్రశాంత్. ఈ మాటలు విని సినీ ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోతున్నారు. ఏంటి సినిమాలో తన డైలాగ్స్ తానే రాసుకున్నాడా? అని షాక్ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. మరి కేజీఎఫ్ చాప్టర్ 2 పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.