సుమారు నాలుగేళ్లపాటు నిరీక్షించిన ఎదురుచూపులకు ఇటీవలే విడుదలైన కేజీఎఫ్-2 చిత్రం ఊహించని స్థాయిలో జవాబిచ్చింది. రాకింగ్ స్టార్ యష్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. 2018లో కేజీఎఫ్ మొదటి భాగం విడుదలై మంచి హిట్ అందుకుంది.. కానీ భారీ అంచనాల నడుమ విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసి దూసుకుపోతుంది.
నాలుగేళ్ల క్రితం వచ్చిన కేజీఎఫ్ ఫస్ట్ పార్టులో రాకీ ఇంట్రడక్షన్, కేజీఎఫ్ సామ్రాజ్యం, హీరో తల్లికి ఇచ్చిన మాట, రాకీగా రంగంలోకి దిగి రాకీభాయ్ గా ఎదిగిన తీరును చూపించాడు దర్శకుడు. అసలు రాకీభాయ్ తర్వాత ఏం చేశాడు.. తన తల్లి మాటను ఎలా నెరవేర్చాడు.. రాకీభాయ్ బిజినెస్ – లైఫ్ – ఇదంతా చూపించి ఊహించని విధంగా ఎండ్ చేశారు. అయితే.. కేజీఎఫ్ సినిమాలో కామన్ గా చూసింది మాత్రం భీభత్సమైన ఎలివేషన్స్ – హీరోయిజం – అదిరిపోయే యాక్షన్ సీక్వెన్సులు.. మధ్యమధ్యలో మదర్ సెంటిమెంట్.. ఇలా అన్నివిధాలుగా ప్రేక్షకులను మెప్పించారు మేకర్స్.
ఇక మొదటి భాగంలో రాకీకి పవర్స్ రావడమే చూపించి.. రెండో భాగంలో రాకీభాయ్ బ్రతికిన తీరును, హుందాతనాన్ని ప్రతిదీ ఎలివేట్ చేశారు. అయితే.. మొదటి భాగంలో రాకీ చిన్నప్పుడు సీన్లకు.. రెండో భాగంలో ఆ సీన్లకు ఇచ్చిన ఎండింగ్ చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సినిమాలో రాకీభాయ్ చిన్నప్పటి నుండి ఎదిగిన సన్నివేశాలను ఎప్పటికీ మర్చిపోలేరు. కానీ ఆ సన్నివేశాల వెనుక దాగిఉన్న అర్థం తెలుసుకుంటే మాత్రం మైండ్ పోవాల్సిందే.. డైరెక్టర్ ప్రశాంత్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
ఎందుకంటే.. సినిమాలో ఒక సీన్ ఉంది. హీరో చిన్నప్పుడు సముద్రం దగ్గర నిలబడి చూస్తూ ఉంటాడు. పెద్దయ్యాక కూడా సముద్రం అదే సముద్రం వద్ద నిలబడి “ఈ సముద్రం లోతెంత.. లోతు తెలియకుండా ఎలా దిగడం.. అయినాసరే దిగేద్దాం” అని చెప్తాడు. సినిమాలో మధ్యమధ్యలో రాకీ సముద్రం వద్ద నిలబడినట్లు చూపించేసరికి.. అందరూ సముద్రానికి – సినిమా కథకు ఏదో లింక్ ఉండే ఉంటుందని ఎక్సపెక్ట్ చేశారు. అయితే.. రాకీ భాయ్ చెప్పిన మాటలకు రెండో పార్ట్ లో.. బలమైన అర్థాన్ని చూపించాడు ప్రశాంత్.
కేజీఎఫ్-2లో హీరో కూడబెట్టిన బంగారం మొత్తాన్ని ఒక షిప్ లో పెట్టి దాన్ని సముద్రంలోకి తీసుకెళ్ళి పడేస్తాడు. ఎన్నిసార్లు ఆలోచించినా సినిమా చూసిన వారంతా ఈ ట్విస్టును మాత్రం గెస్ చేసి ఉండరు. తాను చూపించిన హీరోకి, సముద్రానికి మధ్య సరైన అర్థం చూపించి మెప్పించాడు ప్రశాంత్. ఇదొక్కటే కాదు.. కేజీఎఫ్ లో లోతైన అర్థాలు దాగిఉన్న సన్నివేశాలు చాలానే ఉన్నాయి. అదేవిధంగా సినిమా చివరిలో కేజీఎఫ్-3 కూడా ఉందని ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు.
మరి కేజీఎఫ్-2తోనే అయిపోతుందని భావించిన రాకీభాయ్ ఫ్యాన్స్ లో.. పార్ట్-3 పై ఎక్సపెక్టషన్స్ మొదలయ్యాయి. పార్ట్-3లో ఉండే సన్నివేశాలకు.. స్టోరీ లైన్ సింక్ చేసే విధానం ఎలా ఉండబోతుందోనని అభిప్రాయపడుతున్నారు. నిజంగానే పార్ట్-3 తీస్తారా లేదా అనేది క్లారిటీ రాలేదు. కానీ తీస్తే మాత్రం ఆదరించేందుకు ఫ్యాన్స్ రెడీగానే ఉన్నారు. ఇక హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ సినిమాను నిర్మించారు. మరి కేజీఎఫ్ సిరీస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.