బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా రికార్డులు సృష్టించిన సినిమా కేజీఎఫ్. కన్నడ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ చిత్రం కలక్షన్ల వర్షం కురిపించింది. అన్ని భాషల్లో బాక్సాఫిస్ రికార్డులు బద్దలు కొట్టింది. కేజీఎఫ్‌కు సీక్వేల్‌గా ఛాప్టర్-2 ప్లాన్ చేశాడు ప్రశాంత్‌నీల్. ఇంకేముంది సినిమా రిలీజ్ కాకుండానే భారీ అంచనాలతో రికార్డులు బద్దలు కొడుతోంది. కేజీఎఫ్ -2 టీజర్ యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్‌తో సరికొత్త రికార్డులు సృష్టించినట్లు చిత్రబృందం తెలిపింది. పార్ట్ 2ని మరింత బడ్జెట్‌తో భారీగానే ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్‌నీల్. ఛాప్టర్-2లో సంజయ్‌దత్‌లాంటి స్టార్ విలన్ క్యారెక్టర్ చేస్తున్నారంటేనే అర్థమైపోతోంది.. ఈ సినిమా ఏ రేంజ్‌లో ఉండబోతోందో. కేజీఎఫ్‌లోనే అక్కడక్కడ చిన్న సీన్స్ చూపించి పార్ట్ 2పై ప్రశాంత్‌నీల్ భారీ అంచనాలు వచ్చేలా చేశాడు.
కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ కాకుండానే భారీ బిజినెస్ చేస్తోంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్‌ని రూ.55 కోట్లకు అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇక, వరల్డ్ వైడ్ దక్షిణాది భాషల శాటిలైట్ రైట్స్‌ను జీ నెట్‌వర్క్ సొంతం చేసుకుంది. అంటే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం శాటిలైట్ రైట్స్ ఇప్పుడు జీ సొంతం. ఇక, ఎప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా టీవీలో వచ్చినా అది జీ నెట్‌వర్క్‌లోనే అనమాట. ఇదిలా ఉంటే కేజీఎఫ్-2 సినిమా బిజినెస్ చూస్తుంటే చిత్రసీమలో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక, థియాట్రికల్ రైట్స్ ద్వారా సినిమాకి వచ్చేది అంతా లాభమే అవుతుందేమో.