బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయంలో ట్రెండ్ మారిపోయింది. ఇదివరకు థియేటర్లలో సినిమాలు ఎన్ని రోజులు ఆడాయి అని అనేవారు. కానీ ఇప్పుడు ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూల్ చేసింది.. ఫస్ట్ వీక్ ఎంత.. సెకండ్ వీక్.. బ్రేక్ ఈవెన్ ఇలా వందల కోట్లు వసూల్ చేస్తేగానీ హిట్టు, ప్లాప్ లెక్క తేలట్లేదు. తాజాగా బాక్సాఫీస్ ని షేక్ చేసిన సినిమాలలో పాన్ ఇండియా స్థాయిలో KGF-2 నిలవగా, టాలీవుడ్ వరకు సర్కారు వారి పాట రికార్డులు తిరగరాస్తోంది. అయితే.. ఈ రెండు సినిమాలు వాటి స్థాయిలో ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేశాయనే చెప్పాలి.
KGF-2 సినిమా కలెక్షన్స్ చూసినట్లయితే.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – యష్ సృష్టించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తక్కువ బడ్జెట్ తో తెరకెక్కి.. థియేట్రికల్ బిజినెస్ కి డబుల్ కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా KGF-2 సినిమా.. 40 రోజులకు రూ. 1230కోట్లు గ్రాస్, రూ. 603 కోట్లు షేర్ రాబట్టి ఔరా అనిపించింది. ఏరియా వైస్ షేర్ కలెక్షన్స్ చూస్తే.. కర్ణాటకలో రూ. 105కోట్లు, తెలుగులో రూ. 84కోట్లు, తమిళనాడులో రూ. 56 కోట్లు, కేరళలో రూ. 33 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 100కోట్లు, హిందీ(రెస్ట్ ఆఫ్ ఇండియా)లో రూ. 223 కోట్లు షేర్ కలెక్ట్ చేసి ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది.
#KGFChapter2 WW Box Office
Week 1 to 5 – ₹ 1210.53 cr
Week 6
Day 1 – ₹ 3.10 cr
Day 2 – ₹ 3.48 cr
Day 3 – ₹ 4.02 cr
Day 4 – ₹ 4.68 cr
Total – ₹ 1225.81 crDREAM RUN continues.
— Manobala Vijayabalan (@ManobalaV) May 23, 2022
ఇక సర్కారు వారి పాట కలెక్షన్స్ విషయానికి వస్తే.. సూపర్ స్టార్ మహేష్ – కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమాను పరశురామ్ తెరకెక్కించాడు. మే 12న విడుదలైన ఈ సినిమా 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ఈ ఏడాది టాలీవుడ్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. షేర్ చూసినట్లయితే.. ఫస్ట్ వీక్ లోనే బ్రేక్ ఈవెన్ చేసిన ఈ సినిమా.. రూ. 136 కోట్ల షేర్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. మరి KGF 2, సర్కారు వారి పాట సినిమాల కలెక్షన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Super 🌟 @urstrulyMahesh‘s SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s
— Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022