తెలుగు ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ సందడి మాములుగా లేదు. రోజులు గడుస్తున్నకొద్దీ కొత్తవాళ్ళు వస్తున్నారు. అయితే.. ఎవరు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చినా, ఇండస్ట్రీలో ఎంతకాలం ఉంటారో చెప్పలేం. అందం, అభినయం ఉన్న కొంతమందికి అవకాశాలు ఉండవు. అవకాశాలు ఉన్నాకూడా సరైన హిట్లు లేక మరికొందరు. ఇప్పుడున్న పోటీలో అవకాశాలు రావాలంటే కుర్ర హీరోయిన్లు ఏదొక ప్రత్యేక టాలెంట్ ప్రూవ్ చేసుకోకతప్పదు.
ఇండస్ట్రీలో ఫేమ్ అనేది వెనుకాముందు రావచ్చు. అయితే.. డెబ్యూ మూవీకి ముందే క్రేజ్ తెచ్చుకునేవారు కొందరుంటారు. ఆ కోవకే చెందుతుంది రొమాంటిక్ బ్యూటీ కేతికా శర్మ. ఈ పాతికేళ్ల చిన్నది.. రొమాంటిక్ అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. ఆ తర్వాత లక్ష్య మూవీ చేసింది. ఈ రెండు సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ కేతికాకి హిట్ అందించలేకపోయాయి.
ప్రస్తుతం మెగాహీరో వైష్ణవ్ తేజ్ సరసన ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమా చేస్తోంది. ఇదిలా ఉండగా.. కేతికా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ముఖ్యంగా గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో చాలా చురుకుగా ఉంటుంది. గ్లామరస్ డ్రెస్సింగ్ లో కొత్త కొత్త ఫోటోషూట్స్, వర్కౌట్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ కి అందాలను విందు చేస్తోంది. ఇంస్టాగ్రామ్ లో 2 మిలియన్స్ ఫాలోయింగ్ కలిగిన కేతికా.. తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
హీరోయిన్లు అనగానే ఆకట్టుకునే అందచందాలు వారి సొంతం. స్టయిలిష్ ఎల్లో అవుట్ ఫిట్ లో కేతికా అందాలు కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ‘వాట్ ఏ షాట్’ అనే క్యాప్షన్ తో కేతికా.. గ్లామర్ కి ఫిదా అవుతున్నారు నెటిజన్లు. అందాలతో చిచ్చుపెట్టే సోయగం నీలో చూసామే.. అంటూ కంప్లిమెంట్స్ కురిపిస్తున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న కేతికా గ్లామరస్ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.