హీరోయిన్ కీర్తి సురేష్ పేరు చెప్పగానే ‘మహానటి’ సినిమానే గుర్తొస్తుంది. నటిగా ఎన్ని మూవీస్ చేసినా సరే ఆ చిత్రం.. ఆమెకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలుగా ‘భోళా శంకర్’, నాని ‘దసరా’ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళంలో ఉదయనిధి స్టాలిన్, శింబులతో కలిసి నటిస్తోంది. వీటితో పాటే రివాల్వర్ రీటా, రఘుతాత అనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తూ బిజీగా ఉంది. ఇప్పుడు తన మూవీ టీమ్ కి సర్ ప్రైజ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మలయాళంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేశ్, ‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నేను లోకల్, అజ్ఞాతవాసి మూవీస్ చేసింది కానీ ‘మహానటి’తో స్టార్ హోదా దక్కించుకుంది. నేషనల్ అవార్డు కూడా సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో కన్నడ తప్పించి అన్ని భాషల్లో నటిస్తున్న ఈ భామ.. తన గొప్ప మనసు చాటుకుంది. ఏకంగా మూవీ టీమ్ మొత్తానికి గోల్డ్ కాయిన్స్ ఇచ్చినట్లు సమాచారం.
నానితో ‘నేను లోకల్’ చేసిన కీర్తి.. తాజాగా ‘దసరా’ షూటింగ్ కంప్లీట్ చేసింది. సింగరేణి బ్యాక్ డ్రాప్ తో తీస్తున్న ఈ సినిమాలో హీరోహీరోయిన్లిద్దరూ కూడా డీ గ్లామర్ రోల్స్ లో కనిపించనున్నారు. ఇక రీసెంట్ గానే షూటింగ్ గా కంప్లీట్ అయింది. అయితే చివరి రోజున అందరినీ సర్ ప్రైజ్ చేసిన కీర్తి సురేష్.. రెండు గ్రాముల బంగారు నాణెలను 130 మందికి గిఫ్ట్ గా ఇచ్చిందట. దీని కోసం ఏకంగా రూ. 13 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. గతంలోనూ మహానటి, పందెం కోడి 2 యూనిట్స్ కూడా ఇలానే గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన కీర్తి వార్తల్లో నిలిచింది. మరి కీర్తి.. గోల్డ్ కాయిన్స్ గిఫ్ట్ గా ఇచ్చిందనే వార్తలపై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్స్ లో పోస్ట్ చేయండి.