హీరో నిఖిల్.. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. హ్యాపీడేస్ సినిమాతో పరిచయం అయిన నిఖిల్.. ఆ తరువాత వరుసగా కొన్ని మాస్ చిత్రాలు చేశాడు. ఆ తర్వాత కార్తికేయ చిత్రంతో అతడి కెరీర్ మలుపు తిరిగింది. సైన్స్-దైవం అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయం సాధించింది. ఇక అప్పటి నుంచి నిఖిల్.. సినిమా సెలక్షన్ల విషయంలో కూడా మార్పు వచ్చింది. ఎనిమిది సంవత్సరాల క్రితం వచ్చిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్‌గా పార్ట్ 2 తీశారు. గత రెండేళ్ల నుంచి సినిమాకు ఎన్నో అడ్డంకులు వచ్చాయి. కరోనా కారణంగానే సినిమా షూటింగ్ సమయంలోనే అనేక ఇబ్బందులు తలెత్తాయి. వాస్తవంగా కార్తికేయ 2 గత ఏడాదే రిలీజ్ కావాల్సింది. కరోనా ఇలాంటి కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక చివరకు ఈ ఏడాది ఆగస్టు 12న కార్తీకేయ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ క్రమంలో హీరో నిఖిల్.. సినిమా విడుదలకు సంబంధించి తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. కొందరు తన సినిమా విడుదలను వాయిదా వేయాలని.. పక్కకు తోసేయాలని చూశారని చెప్పుకొచ్చాడు. బ్యాగ్రౌండ్ లేని సినిమాల విడుదల విషయంలో ఇలా జరుగుతుందని అన్నారు. ఆగస్టు 12న రిలీజ్ డేట్ ప్రకటించే ముందు కూడా ఇప్పుడు వద్దు.. అక్టోబర్, నవంబర్‌కు వెళ్లిపోవాలని అన్నారని చెప్పుకొచ్చాడు. అంతేకాక.. ఇప్పుడు సినిమా రిలీజ్ చేస్తే థియేటర్లు కూడా దొరకవని అన్నారని.. ఆ రోజు తాను ఏడ్చానని చెప్పుకొచ్చాడు నిఖిల్. కానీ నిర్మాతలు మాత్రం ధైర్యంగా ఆగస్టు 12న విడుదల తేదీని ప్రకటించారు అని చెప్పుకొచ్చాడు నిఖిల్. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.