Nikhil Siddharth: ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలో హీరోగా నిలదొక్కుకున్నారు నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ మొదట్లో చిన్నచిన్న పాత్రల్లో నటించారు. 2007లో వచ్చిన ‘హ్యాపీడేస్’ సినిమాతో నిఖిల్ కెరీర్ టర్న్ అయింది. నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ‘స్వామి రారా’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. తనకంటూ ఓ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన కార్తికేయ 2, స్పై, 18 పేజెస్ సినిమాల్లో నటిస్తున్నారు. సినిమా షూటింగ్‌లతో బిజిబిజీగా ఉండే నిఖిల్.. ఓ సీరియల్లోకి సడెన్ ఎంట్రీ ఇచ్చారు. అంటే!.. సీరియల్లో పూర్తి స్థాయి రోల్ కోసం అయితే కాదులెండి. జీ తెలుగులో ప్రసారం అవుతున్న మోస్ట్ పాపులర్ సీరియల్స్‌లో ఒకటైన ‘రాధమ్మ కూతురు’లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చారు. ఆపదలో ఉన్న ఓ మహిళను రక్షించి, హీరో, హీరోయిన్ల బంధాన్ని నిలబెట్టే ఓ కీలక వ్యక్తిగా ఆయన మారిపోయారు. విలన్లతో ఫైట్ చేసి హీరో, హీరోయిన్లను కలపనున్నారు. నిఖిల్ తన మాస్ ఎంట్రీతో సీరియల్ అభిమానులను ఆశ్చర్యపరిచారు. రాధమ్మ కూతురు ఎపిసోడ్ 842కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ ప్రోమోలో నిఖిల్ ఎంట్రీ హైలెట్‌గా నిలిచింది. ఇక, రాధమ్మ కూతురులో నిఖిల్ అనుకోని ఎంట్రీతో సీరియల్ అభిమానులతో పాటు నిఖిల్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి, ‘రాధమ్మ కూతురు’ సీరియల్లోకి హీరో నిఖిల్ ఎంట్రీపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇవి కూడా చదవండి : ఒకే సినిమాలో బావ బామ్మర్ది పాత్రల్లో మెగా, నందమూరి హీరోలు?