గత ఐదు సంవత్సరాలుగా తెలుగు టెలివిజన్ ఇండస్ట్రీలో నంబర్ 1 సీరియల్‌గా కొనసాగుతోంది కార్తీకదీపం సీరియల్. అయితే తాజాగా ఈ సీరియల్‌లో ఊహించని ట్విస్ట్‌లు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా సీరియల్‌లో కీలక పాత్రలైన డాక్టర్ బాబు, వంటలక్క క్యారెక్టర్లను చంపేసి.. ప్రేక్షకులకు ఊహించని షాక్ ఇచ్చాడు దర్శకుడు. ఆ తర్వాత మోనిత, ఆదిత్య, మరికొన్ని క్యారెక్టర్లను తప్పిస్తూ వచ్చాడు. ఇక తరువాత సీరియల్ పిల్లలతోనే ఉంటుందని.. వారి మధ్య జరిగే సంఘటనలతో సీరియల్ సాగుతుందని తెలిపాడు. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్ ప్రకారం చూసుకుంటే.. కారు ప్రమాదంలో హిమ బతకడం, సౌర్య తనపై కోపం పెంచుకోవడం వంటి సన్నివేశాలు వచ్చాయి.
ఇది కూడా చదవండి: కార్తీకదీపం సీరియల్ లో బిగ్ ట్విస్ట్! బిగ్ బాస్ ఫేమ్ మానస్ ఎంట్రీ!
ఇక తాజాగా రిలీజైన ప్రోమోలో డైరెక్టర్ మరో రివర్స్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు సౌర్య.. తన నానమ్మ సౌందర్య దగ్గర ఉన్నట్లు చూపించిన సంగతి తెలిసిందే. ఇక తాజా ప్రోమోలో హిమ తిరిగి సౌందర్య దగ్గరకు రాగా.. అమ్మనాన్నల చావుకి కారణమైన హిమతో కలిసి ఉండలేనని సౌర్య ఇంటి నుంచి వెళ్లిపోతుంది. సీన్ కట్ చేస్తే సౌర్య పెరిగి పెద్దదై ఆటో డ్రైవైర్ అయితే.. హిమ డాక్టర్ అయ్యింది. ఇక ప్రోమోలో సౌర్యని ఎలాగైనా వెతికి వెనక్కితీసుకుని వస్తానని హిమ అనుకుంటూ ఉంటే.. సౌర్య మాత్రం అమ్మనాన్నల చావుకు కారణమైన హిమను ఎన్నటికి క్షమించను అని అనుకోవడం చూపించారు. ఇక ‘‘వేధించే గతాన్ని.. రక్తసంబంధం చెరిపేస్తుందా..! అక్కాచెళ్లెల్ల కథతో సరికొత్తగా కార్తీకదీపం’’ అంటూ కొత్త ప్రోమోని రిలీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: వీడియో: రొమాంటిక్ పాటకు ‘కార్తీక దీపం’ ఫేమ్ కార్తీక్ – మోనిత డ్యాన్స్!
ఇక హిమ పాత్రలో మనసిచ్చి చూడు ఫేమ్ భాను కనిపించగా.. సౌర్య పాత్రలో మరో కొత్త యువతి నటించింది. ఇక వీళ్లిద్దరికి జోడిగా మరో ఇద్దరు హీరోలను కార్తీకదీపం సీరియల్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వీరిలో ఒకరు కోయిలమ్మ సీరియల్ నటుడు కాగా, మరొకరు బిగ్‌బాస్ సీజన్ 5 ఫేమ్ మానస్ మరొక క్యారెక్టర్ చేయబోతున్నారని తెలుస్తోంది.
ఇక కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలతో పాటు హిమ, సౌర్య పాత్రలు కూడా అంతే క్రేజ్ సంపాదించుకున్నాయి. హిమ పాత్రలో సహృద, సౌర్య పాత్రలో బేబి క్రితికలు నటించి.. అద్భుత నటనతో ప్రేక్షకుల్ని మెప్పించారు. కార్తీకదీపం సీరియల్ ఇప్పటివరకూ దాదాపు ఐదేళ్లు సాగిందంటే.. అందులో ఈ పిల్లల ప్రాధాన్యత కూడా ఎక్కువే. కొన్ని ఎపిసోడ్‌లు అయితే ఈ ఇద్దరు పిల్లలపైనే నడిచాయి. పిల్లలే కానీ సీనియర్లకు ధీటుగా.. అద్భుతమైన హావభావాలతో.. ముఖ్యంగా దీప, కార్తీక్‌లతో పోటీపడి నటించారు సహృద, క్రితికలు.
ఇది కూడా చదవండి: కార్తీకదీపం సీరియల్‌లో ఇక కనిపించను: డాక్టర్ బాబు
అయితే ఈ పాత్రలు తప్పించి వాళ్ల ప్లేస్‌లో కొత్త క్యారెక్టర్లను తీసుకుని రావడంతో కార్తీకదీపం ప్రేక్షకులకు కాస్త నిరాశ అనే చెప్పాలి. దీప, కార్తీక్, మోనితలను తీసేసి.. సీరియల్ ఎలా సాగుతుంది అనే డౌట్ క్రియేట్ చేశారు. ఇప్పుడు పిల్లల పాత్రలో కొత్త వాళ్లు ఎంట్రీ ఇచ్చారు. మరి ఈ మార్పులతో కార్తీకదీపం సీరియల్ వెలిగిపోతుందో.. లేక ప్రేక్షకులు నిరాదరణకు గురయ్యి ఆరిపోతుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.