సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకపోతే ఎంత టాలెంట్ ఉన్న పైకి రావడం కష్టం. కానీ ఎలాంటి బ్యాగ్ గ్రౌండ్ లేకుండా కొంత మంది సినీ నటులు తమ టాలెంట్ తో సత్తా చాటుతూ ప్రేక్షకుల హృదయాలు గెలిచారు. బాలీవుడ్ లో ఎంతో మంది కమెడిన్లు ఎంట్రీ ఇచ్చారు. ఎవరి ప్రత్యేకత వారే చాటుకున్నారు. బాలీవుడ్ ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, కమెడియన్ కపిల్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమెడియన్‌గా పలు సినిమాలు, షోల ద్వారా మెప్పించి కపిల్ శర్మ షోతో అతడు పాపులర్ అయ్యాడు. స్టేజ్ పై కపిల్ శర్మ కనిపిస్తే చాటు నవ్వులే నవ్వులు.. తన మేనరీజం, కామెడీ పంచులతో కడుపుబ్బా నవ్విస్తుంటాడు.
కపిల్ శర్మ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో అతడు డెలివరీ బాయ్ గెటప్‌లో రోడ్డుపై బైక్ నడుపుతూ కనిపిస్తున్నాడు. ఓ కంపెనీకి చెందిన పసుపు రంగు టీ షర్టును ధరించి వెనకాల బ్లూ కలర్ బ్యాగ్ వేసుకున్నాడు. సాధారణంగా ఫుడ్ డెలివరీ బాయ్‌లు ఇలాంటి బ్యాగ్‌లు వెనుక తగిలించుకుని ఆహారాన్ని పంపిణీ చేస్తారు.
వివరాల్లోకి వెళితే.. ప్రముఖ బాలీవుడ్ నటి నందితా దాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో కపిల్ శర్మ డెలివరీ బాయ్‌గా పనిచేసి జీవనోపాధి పొందుతాడని తాజా ఫోటో ద్వారా అర్థమవుతోంది. ఈ మూవీ షూటింగ్‌లో భాగంగానే ఎవరో ఫోటో తీసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారని తెలుస్తోంది. కపిల్ శర్మ నటిస్తున్న ఈ మూవీలో సహానా గోస్వామి హీరోయిన్‌గా నటిస్తోంది.