ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిన్న సినిమాలలో ‘కాంతార’ ఒకటి. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకి అనువాదమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతార.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రెండు వారాలకు మిగతా భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే.. విడుదలైన ప్రతి చోటా కాంతార మంచి టాక్ అందుకొని కలెక్షన్స్ పరంగా రికార్డులు సెట్ చేసింది. కేజీఎఫ్, సలార్ సినిమాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ వారు ఈ కాంతార సినిమా నిర్మించారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్ల గ్రాస్ వసూల్ చేయడం విశేషం.
ఇక కాంతార సినిమాను కన్నడతో పాటు రిలీజైన అన్ని భాషల్లో ప్రేక్షకులు ఓన్ చేసుకున్నారు. కర్ణాటకకు చెందిన భూతకోలా నృత్యానికి, వరాహ మూర్తిని పూజించే తెగకు సంబంధించిన నేపథ్యంతో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమాలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. స్వీయ దర్శకత్వంలో సినిమాని తెరకెక్కించాడు. హీరోయిన్ సప్తమి గౌడ ఈ సినిమాతో డెబ్యూ చేసింది. అయితే.. ఈ ఏడాది విడుదలైన అన్ని సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకున్న ఏకైక సినిమాగా కాంతార గుర్తింపు తెచ్చుకుంది. అంతేగాక.. పాన్ ఇండియా సినిమాలను దాటుకొని రూ. 400 కోట్లు కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.
ఇక థియేట్రికల్ రిలీజ్ అయిన 50 రోజుల తర్వాత కాంతార.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటిటి రిలీజ్ అయ్యింది. ఓటిటిలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకున్న ఈ సినిమా.. వరాహ రూపం సాంగ్ పట్ల ఫ్యాన్స్ అందరినీ నిరాశపరిచింది. ఇదిలా ఉండగా.. కాంతార మూవీని థియేటర్స్ లో మరోసారి చూడాలని అనుకునేవారికి గుడ్ న్యూస్ చెప్పారు మేకర్స్. కాంతారని డిసెంబర్ 2న గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. కాకపోతే.. ఆల్రెడీ రిలీజ్ అయిన భాషలో కాదు. తుళు భాషలో కాంతార డిసెంబర్ 2న రిలీజ్ అవుతోంది. ఈ సినిమాకి కథాకథనాలతో పాటు అజనీష్ లోకనాథ్ సంగీతం ప్లస్ అయ్యింది. మరి కన్నడతో తుళు సంప్రదాయానికి దగ్గరగా ఉన్న కాంతార.. అక్కడ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి!
ತುಳುವನಾಡ ದಂತಕಥೆನ್ ನಮ್ಮ ತುಳು ಭಾಷೆಡೇ ತೂಪುನ ಪೊರ್ತು ಬೈದ್ಂಡ್. ಲೋಕೊರ್ಮೆ ಜನಕುಲೆನ ಉಡಲ್ ಗೆಂದಿನ “ಕಾಂತಾರ” ದ ತುಳು ಅವತರಣಿಕೆ ನಮ್ಮ ದೇಶೊಡು ಉಂದುವೇ ಬರ್ಪಿನ ಡಿಸೆಂಬರ್ 2, 2022 ದಾನಿ ನಿಕ್ಲೆನ ಮುಟ್ಟದ ಚಿತ್ರಮಂದಿರಲೆಡ್ ಬುಡುಗಡೆ ಆವೆರೆ ಉಂಡು. ಪಿದಯಿ ದೇಶೊಡು ನವೆಂಬರ್ 25 ತಾರೀಖ್ ದಾನಿ ಬುಡುಗಡೆ ಆವೆರೆ ಉಂಡು#KantaraInTulu pic.twitter.com/3ehfJMEq1n
— Hombale Films (@hombalefilms) November 24, 2022