డార్లింగ్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా, పాన్ వరల్డ్ సినిమాలను లైనప్ చేసి ఫ్యాన్స్ లో అంచనాలను అమాంతం పెంచేశాడు. బాహుబలి, సాహో సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్ ఇంటర్నేషనల్ రేంజ్ కి వెళ్లిన సంగతి తెలిసిందే. అప్పటినుండి డార్లింగ్ నుండి ఏ సినిమా వచ్చినా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్నాయి. దర్శకనిర్మాతలు కూడా ప్రభాస్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని హై బడ్జెట్ తో సినిమాలు రూపొందిస్తున్నారు. ప్రెజెంట్ ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా […]
గతేడాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సినిమాలలో ‘కాంతార‘ ఒకటి. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా నటించి.. దర్శకత్వం వహించిన ఈ సినిమాని కేజీఎఫ్, సలార్ సినిమాలను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించారు. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో రూపొందిన కాంతార.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 400 కోట్లకు పైగా వసూల్ చేయడం విశేషం. కర్ణాటకలోని […]
కన్నడ సూపర్ హిట్ సినిమా ‘కాంతార’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చిన్న చిత్రంగా రిలీజైన ఈ మూవీ.. వసూళ్లలో అనేక రికార్డులు క్రియేట్ చేసింది. తొలుత కన్నడలో విడుదలైన ఈ ఫిల్మ్ బంపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళం, తెలుగు, హిందీల్లో అనువాదమైంది. ఈ మూడు భాషల్లోనూ ‘కాంతార’ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లతో వావ్ అనిపించింది. థియేట్రికల్ […]
ఈ మధ్యకాలంలో రెగ్యులర్ సినిమాలు కాకుండా కొత్త కంటెంట్ ఉన్న సినిమాలను బాగా ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. ముఖ్యంగా కంటెంట్ ఉన్న ప్రయోగాత్మక సినిమాలను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నారు. ఆడియెన్స్ సినిమాలు చూసే విధానం మారిపోయిందని మేకర్స్ కూడా డిఫరెంట్ జానర్స్ లో సినిమాలను తెరపైకి తీసుకొస్తున్నారు. ఏ జానర్ సినిమాలైనా కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. పాన్ ఇండియా వైడ్ హిట్ చేస్తున్నారు. అలా ప్రేక్షకులకు కొత్త కలిగించేలా చాలా సినిమాలు తెరకెక్కుతున్నాయి. రీసెంట్ గా […]
ఫస్ట్ ఫస్ట్.. ఈ న్యూస్ చూడగానే మీరు కచ్చితంగా షాకయ్యుంటారు. ఎందుకంటే వేల కోట్ల కలెక్షన్స్ సాధించిన ‘కేజీఎఫ్’ సినిమాల్లోని హీరోని మార్చేయబోతున్నారా? సీక్వెల్ కోసం కొత్త హీరోని తీసుకొచ్చి పెడతారా? నిర్మాత మాట్లాడింది చూస్తుంటే.. ఆయనకు ఏమైనా పిచ్చి పట్టిందా? అని సగటు నెటిజన్ అభిప్రాయపడుతున్నాడు. కానీ దీని వెనక కారణాలు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? ఇక […]
‘కేజీఎఫ్’, ‘కాంతార’ సినిమాలు.. కన్నడ ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇక ప్రొడ్యూసర్స్ కి వందల కోట్ల లాభాలు చూపించాయి. ప్రస్తుతం కన్నడలో మాత్రమే సినిమలు తీస్తున్న వీళ్లు.. ఇప్పుడు సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. అన్ని భాషల్లోనూ మూవీస్ తీద్దామని ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అందుకు తగ్గట్లే వేల కోట్లు పెట్టి మరీ సినిమాలు తీస్తామని అంటున్నారు. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఇంతకీ హోంబలే అధినేత విజయ్ ఏం చెప్పారు? […]
ఈ ఏడాది చిన్న సినిమాగా విడుదలై కన్నడ చిత్రం ‘కాంతార‘ సృష్టించిన మ్యాజిక్ గురించి తెలిసిందే. కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా.. పాన్ ఇండియా స్థాయిలో పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని.. కలెక్షన్స్ వర్షం కురిపించింది. కట్ చేస్తే.. రూ. 400 కోట్లు కలెక్ట్ చేసి ఇండస్ట్రీ రికార్డు సెట్ చేసింది. దీంతో భారీ బడ్జెట్ సినిమాలు తీసే దర్శకనిర్మాతలు కూడా ఒక్కసారిగా ఆలోచనలో పడిపోయారు. డబ్బింగ్ సినిమాగా వచ్చి […]
‘కాంతార‘ ఈ ఏడాది ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన కన్నడ సినిమా. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ అయిన కాంతార.. విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన టాక్, కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెరకెక్కించి హీరోగా నటించిన రిషబ్ శెట్టికి దేశవ్యాప్తంగా సూపర్ క్రేజ్.. సినిమా నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారికి ఊహించని ప్రాఫిట్స్ వచ్చి చేరాయి. అదీగాక ఫస్ట్ డే ఎన్ని థియేటర్స్ లో విడుదలైందో.. అన్ని థియేటర్స్ లోను కాంతార […]
ఈ మధ్యకాలంలో థియేట్రికల్ రిలీజై బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిన్న సినిమాలలో ‘కాంతార’ ఒకటి. కన్నడ భాషలో తెరకెక్కిన ఈ సినిమా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోకి అనువాదమై అద్భుతమైన విజయాన్ని అందుకుంది. సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలైన కాంతార.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని రెండు వారాలకు మిగతా భాషల్లో రిలీజ్ అయ్యింది. అయితే.. విడుదలైన ప్రతి చోటా కాంతార మంచి టాక్ అందుకొని కలెక్షన్స్ పరంగా రికార్డులు సెట్ చేసింది. […]
గత కొన్ని వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ‘కాంతార’ సినిమా పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. మొదట కన్నడలో విడుదలైన ఈ సినిమాకి హైలీ పాజిటివ్ టాక్ రావడంతో నిర్మాతలు తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేశారు. విడుదలైన అన్ని చోట్లా కాంతార మంచి ఆదరణ సొంతం చేసుకొని అద్భుతమైన కలెక్షన్స్ కూడా నమోదు చేసింది. ఇప్పటికే పాన్ ఇండియా సినిమాలను వెనక్కి నెడుతూ.. కాంతార ప్రపంచవ్యాప్తంగా రూ. 400 […]