'కాస్టింగ్ కౌచ్'.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే మాట. ఇప్పటికే పలువురు నటీమణులు, హీరోయిన్స్ ఈ విషయంపై బహిరంగంగా గళం విప్పారు. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతి సినీ ఇండస్ట్రీలో కామన్ అని, కొందరు హీరోయిన్లు అందుకు తలొగ్గుతారని మొహమాటం లేకుండా మాట్లాడారు. ప్రేక్షకులు సైతం ఇదే నిజమని అనుకుంటారు. కానీ, నేనందుకు పూర్తిగా విభిన్నమంటూ ఓ బాలీవుడ్ హీరోయిన్ బాంబ్ పేల్చింది.
‘కాస్టింగ్ కౌచ్’.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే మాట. ఇప్పటికే పలువురు నటీమణులు, హీరోయిన్స్ ఈ విషయంపై బహిరంగంగా గళం విప్పారు. అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్స్‌కు ఎర వేయడం అనే సంస్కృతి సినీ ఇండస్ట్రీలో కామన్ అని, కొందరు హీరోయిన్లు అందుకు తలొగ్గుతారని మొహమాటం లేకుండా మాట్లాడారు. ప్రేక్షకులు సైతం ఇదే నిజమని అనుకుంటారు. కానీ, నేనందుకు పూర్తిగా విభిన్నమంటూ బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్ బాంబు పేల్చింది. అందుకు అంగీకరించకపోవడం వల్లనే తనపై పిచ్చిది అనే ముద్ర వేసి జైలుకు పంపేందుకు కుట్రలు పన్నారని ఆమె ఆరోపించింది.
కాంట్రవర్సీ క్వీన్ గా పేరుగాంచిన కంగనా రనౌత్.. సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం ఏదో ఒక టాపిక్ గురించి ఘాటుగా స్పందిస్తూ హాట్ టాపిక్ గా మారుతుంటారు. ఈ భామ ఇటీవలే తన తల్లి ఓ పొలంలో పని చేస్తున్న పిక్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన తల్లి బాలీవుడ్ హీరోయిన్ కు తల్లి అయినప్పటికీ నేటికీ వ్యవసాయం చేస్తూ తన అభిరుచిని చాటుకుంటోందని తెలిపారు. ఆ పోస్ట్క్షణాల్లో వైరల్ అవ్వగా.. నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేశారు. ఓ నెటిజన్.. “లక్షాధికారి అయిన తర్వాత కూడా.. కంగనా తల్లి పొలంలో పని చేస్తోంది. ఆమె చాలా సింప్లిసిటీతో ఉన్నారు..” అని రాసుకొచ్చాడు.
ఇదే విషయమై కంగనా రనౌత్ స్పందించారు. “దయచేసి ఓ విషయం గమనించండి.. నా వల్ల నా తల్లి సంపన్నురాలు కాదు. నేను వ్యాపారవేత్తలు ఉన్న కుటుంబం నుంచి వచ్చాను. కానీ మా అమ్మ 25 ఏళ్లకు పైగా టీచర్‌గా పని చేసింది. బాలీవుడ్ అనేది ఓ మాఫియా. ఈ మాఫియాపై నేను రియాక్టయ్యే తీరుకి కారణం ఆమెనే. అందరిలా ముసిముసి నవ్వులు, ఐటెం సాంగ్స్, పెళ్లిళ్లలో డ్యాన్స్లు , రాత్రిపూట హీరోల గదులకు వెళ్లడం వంటి పనులు నేను చేయలేను.. చేయను.. అందుకే నాపై పిచ్చిది అనే ముద్ర వేసి జైలుకు పంపేందుకు కుట్రలు చేశారు” అని కంగనా ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది.
Please note my mother is not rich because of me, I come from a family of politicians, bureaucrats and businessmen. Mom has been a teacher for more than 25 years, film mafia must understand where my attitude comes from and why I can’t do cheap stuff and dance in weddings like them https://t.co/SH8eUfe8ps
— Kangana Ranaut (@KanganaTeam) February 27, 2023
కాగా.. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ పెళ్లిలో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్ కలిసి స్టేజ్‌పై డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. వాటిని దృష్టిలో పెట్టుకునే కంగనా పైవిధంగా సెటైర్లు వేసిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కంగనా వ్యాఖ్యలపై.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Salman Khan and Akshay Kumar’s special performance at a wedding in Delhi; Watch them groove!#SalmanKhan #AkshayKumar #weddingday #dance #selfiee #kisikabhaikisikijaan #biggboss16 #salmankhanfans #mainkhiladi #akshaykumarfans https://t.co/oCmvEAbm0q
— BollywoodMDB (@BollywoodMDB) February 21, 2023